Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి : ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బిల్కిస్ బానో లైంగిక దాడి కేసుకు సంబంధించిన 11 మంది దోషులను విడుదల చేసిన వ్యవహారంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. దోషులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక సిద్ధాంతాన్ని పాటించేవాళ్లు రేపిస్టులకు స్వాగతం చెప్పడం సమాజానికి సిగ్టుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ట్వీట్ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన రేపిస్టులకు ఒక సంస్థకు చెందిన వ్యక్తులు, కుటుంబ సభ్యులు మిఠాయిలు తినిపిస్తూ పూలదండలతో స్వాగతం పలికిన వార్తలు వినటం బాధగా ఉందని పేర్కొన్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వారిని విడుదల చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. లైంగిక దాడికి పాల్పడిన, జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిని క్షమించరాదని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ వారిని విడుదల చేశారని విమర్శించారు. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయం చట్ట విరుద్ధమే కాకుండా మానవత్వానికి కూడా వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఒక మహిళగా బిల్కీస్ భానో అనుభవించిన బాధను తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు.