Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలువురికి గాయాలు, పోలీసుల అదుపులో కంటైనర్ డ్రైవర్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
కంటైనర్ లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో వేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢకొీట్టింది. ఒక వ్యక్తి చెయ్యి పూర్తిగా ఇరిగిపోగా పలువురికి గాయాల య్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. మైలార్దేవులపల్లి సీఐ నరసింహ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రవి ఫుడ్ కంపెనీలో నుంచి గుజరాత్‌కి చెందిన బిస్కెట్ కంపెనీకి చెందిన లోడ్‌ను ఆన్లోడ్ చేసుకొని బయటకు వస్తున్న కంటైనర్ లారీకి బ్రేకులు ఫెయిలై కంపెనీను గేటును బద్దలు కొట్టుకొని శ్రీరామ్ కాలనీ నుంచి కోఠిÄకి వెళ్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢకొీట్టింది. మరొకవైపు ఇంకొక కంటైనర్ లారీ ఆగి ఉండటంతో రెండు కంటైనర్ల మధ్యలో బస్సు ఇరుక్కుంది. ఈ ప్రమాదంలో జ్ఞానేశ్వర్ అనే యువకుడికి చెయ్యి పూర్తిగా విరిగిపోయింది. అతన్ని వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ కండక్టర్ కాలికి, మరొక వృద్ధురాలు, ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆర్టీసీ బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన గుజరాత్‌కి చెందిన లారీ డ్రైవర్ సలీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గాయపడ్డ ప్రయాణికులకు కంపెనీ యాజమాన్యం నష్టపరిహారం చెల్లించి వారికి పూర్తి చికిత్స చేయించాలని ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.