Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఘన నివాళి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మాజీ అధ్యక్షులు బీ రామారావు నిరంతరం కార్మిక హక్కుల పరిరక్షణ కోసం పరితపించేవారని పలువురు నాయకులు శ్లాఘించారు. శుక్రవారంనాడిక్కడి ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో రామారావు సంతాపసభ జరిగింది. యూనియన్ అధ్యక్షులు ఎస్ బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు యూ రత్నాకరరావు, ఎన్ఎఫ్ఆర్టీడబ్ల్యూ ఉప ప్రధాన కార్యదర్శి కే పద్మాకర్, ఎపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు వైవీ రావు, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రామారావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయనలోని నాయకత్వ లక్షణాలను కొనియాడారు. ఆయన లేని లోటు ఆర్టీసీ కార్మిక వర్గానికి ఉంటుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2001లో 24 రోజుల ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా సడక్‌బంద్, రైల్‌రోకో వంటి అనేక ఆందోళనలకు నాయకత్వం వహించారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సభలో రామారావు కుటుంబసభ్యులు, ఆయన సమకాలీకులు డీఎస్ఎన్ మూర్తి, ఆర్ రుక్మారావు తదితరులు పాల్గొన్నారు.