Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంచిర్యాల, నిర్మల్లో వీఆర్ఏల నిరసన ప్రదర్శన
- బతుకమ్మ బోనాలతో కలెక్టరేట్ల వద్దకు ర్యాలీ
నవతెలంగాణ-మంచిర్యాల
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చేపట్టిన ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని వీఆర్ఏలు స్పష్టం చేశారు. శుక్రవారం నిరసన కార్యక్రమంలో భాగంగా జేఏసీ ఆధ్వర్యంలో మంచిర్యాల, నిర్మల్ జిల్లా కేంద్రాల్లో బతుకమ్మ, బోనాలతో ప్రదర్శన నిర్వహించారు. ప్రధాన చౌరస్తాల వద్ద ఆటాపాటలతో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కలెక్టరేట్ల వరకు ర్యాలీలు చేపట్టారు. నిర్మల్లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ వంగూరి రాములు మాట్లాడారు. వీఆర్ఏల బాధలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. 25రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వీఆర్ఎలంతా దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందినవారేనని గుర్తు చేశారు. పేస్కేల్ అమలు చేసి ప్రతి ఒక్కరికీ ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో జిల్లా చైర్మెన్ జమాల్, కో చైర్మన్ రవి, సెక్రెటరీ జనరల్ తహీరొద్దీన్, కన్వీనర్ ముత్తన్న, కో కన్వీనర్లు చాంద్పాష, సాయన్న, సంతోష్, రమణ, మంచిర్యాలలో జరిగిన నిరసన కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ నాయకులు సాగే ఓంకార్, గణపతి జనార్ధన్, ప్రదీప్, రత్నం, శ్రీనివాస్, కార్తీక్, రాజశేఖర్ సుధాకర్ పాల్గొన్నారు.