Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ:స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్బంగా ఎల్బీ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. సంగీత నాటక అకాడమీ చైర్మెన్ పద్మశ్రీ పద్మజారెడ్డి శిష్య బృందం భారత స్వాతంత్రోద్యమ ఘట్టాలను తెలిపే శాస్త్రీయ నత్యం, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఖవ్వాలి కళాకారులు వార్సీ బ్రదర్స్ ఖవ్వాలి, పద్మశ్రీ శంకర్ మహదేవన్ సంగీత విభావరి సమావేశానికి హాజరైన వారిలో వీక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాయి. ముందుగా ప్రారంభ కార్యక్రమంలో పద్మజా రెడ్డి శిష్య బృందం స్వాతంత్రోద్యమ పోరాట ఘట్టాలను తెలుపుతూ అద్భుతమైన నృత్య ప్రదర్శన నిర్వహించింది. ఝాన్సీ లక్ష్మీబాయి పోరాటం, బ్రిటీష్ అధికారి డల్హౌసీ అరాచకాలు, మొదటి సిపాయిల తిరుగుబాటు, తెలంగాణలో స్వతంత్ర ఉద్యమ పోరాటాలను తెలిపే సంఘటనలను ఈ శాస్త్రీయ నృత్యంలో కళ్ళకు కట్టినట్టు ప్రదర్శించారు. అనంతరం ప్రముఖ ఖవ్వాలి సోదరుల బృందం దేశభక్తి, జాతీయ సమైఖ్యత పూరిత కవ్వాళ్లను ఆలపించారు. లెహరాయి యాహై తిరంగా అనే కవ్వాల్తో ప్రారంభించి, సారాజహాసే అచ్చా, హిందూ సీతా హమారా అనే పాటను కవ్వాల్ రూపంలో అద్భుతంగా ఆలపించి సభను ఉర్రూతలూగించారు. హిందూ, ముస్లీమ్, క్రిష్టియన్ భాయి భాయి అంటూ దేశ సమైక్యతను తెలిపే కవ్వాల్ను అద్భుతంగా ఆలపించారు.
అనంతరం ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ గణేష్ స్తుతితో ప్రారంభించిన సంగీత విభావరిలో తెలుగు, హిందీలలో సూపర్ హిట్ అయిన పాటలను ఆలపించి అదరహౌ అనిపించారు.