Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈనెల 25న మధ్యంతర ఉపశమనాన్ని పరిశీలన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్ బెయిల్ పిటిషన్‌పై గుజరాత్ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసు జారీ చేసింది. 2002 గోద్రా అల్లర్ల కేసుల్లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో సహా ఉన్నతాధికారులను ఇరికించేందుకు పత్రాలను రూపొందించారని ఆరోపిస్తూ అరెస్టయిన ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్ సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఎస్. రవీంద్ర భట్, జస్టిస్ సుధాన్షు ధులియా నేతత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ కేసు విచారణ సందర్భంగా, జస్టిస్ యుయు లలిత్ తాను 2002 అల్లర్లకు సంబంధించిన సోహ్రాబుద్దీన్ హత్య కేసులో కొంతమంది నిందితుల తరపున వాదించామని న్యాయవాదికి తెలియజేశారు. సెతల్వాద్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ జస్టిస్ లలిత్ ఈ కేసును విచారించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. ''అయితే దయచేసి ఏమి జరుగుతుందో చూడండి. సుప్రీం కోర్ట్ ఆర్డర్ నుంచి ఈ కేసు ముందుకొచ్చింది. సెక్షన్ 467 దరఖాస్తు హైకోర్టు ముందు ఎలా ఉంటుంది?'' అని ప్రశ్నించారు. వారి మధ్య కొద్దిసేపు చర్చల అనంతరం న్యాయమూర్తులు ఇలా అన్నారు. ''మేం నోటీసు జారీ చేస్తాము. గురువారం తిరిగి విచారి స్తాం. గుజరాత్ స్టాండింగ్ కౌన్సెల్‌కు తెలపండి. హైకోర్టులో విషయం పెండింగ్‌లో ఉన్నప్పటికీ మేము మధ్యంతర ఉపశమనాన్ని పరిశీలిస్తాం'' అని ధర్మాసనం పేర్కొంది. ఈ ఏడాది మొదట్లో తీస్తా సెతల్వాద్ అరెస్టు కావడంతో ఆమె బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సెతల్వాద్, గుజరాత్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ఆర్బి శ్రీకుమార్ దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తులపై స్పందించాలని గుజరాత్ హైకోర్టు ఆగస్టు 2న ప్రత్యేక దర్యాప్తు బందం (సిట్)కి నోటీసులు జారీ చేసింది. దీనిపై హైకోర్టు సెప్టెంబర్ 19న విచారణ చేపట్టనుంది. తదుపరి విచారణ తేదీకి ఈ సుదీర్ఘ గ్యాప్‌పై సెతల్వాద్ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సతేందర్ కుమార్ యాంటిల్ వర్సెస్ సిబిఐ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం బెయిల్ కేసులను త్వరగా విచారించాలని ఆమె వాదించారు. ''అయినప్పటికీ, ప్రస్తుత కేసులో హైకోర్టు మొదటి తేదీని ఒకటిన్నర నెలల తర్వాత నిర్ణయించింది'' అని ఆమె పేర్కొన్నారు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో హత్యకు గురైన కాంగ్రెస్ ఎంపి ఎహ్సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ జూన్ 24న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆమెపై ప్రతికూల వ్యాఖ్యలు చేయడంతో తీస్తా సెతల్వాద్ అరెస్ట్ జరిగింది. జూలై 30న అహ్మదాబాద్ సెషన్స్ కోర్టు సెతల్వాద్‌కు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. దీంతో సెతల్వాద్ బెయిల్ కోసం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో హైకోర్టు నోటీసు జారీ చేసింది. కానీ సెతల్వాద్‌కు మధ్యంతర ఉపశమనం ఇవ్వలేదు. దీంతో తీస్తా సెతల్వాద్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.