Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలు అందించాలి
- జల్‌శక్తి అభియాన్ పథకం కింద కేంద్రం నిధులు కేటాయించాలి: సీపీఐ(ఎం) యాదాద్రి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ-బీబీనగర్
మూసీని జల కాలుష్యం నుంచి ప్రక్షాళన చేయాలని, మూసీ ఆయకట్టు ప్రాంతంలో గోదావరి కృష్ణా జలాలు అందించాలని సీపీఐ(ఎం) యాదాద్రిభువనగరి జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ డిమాండ్ చేశారు. ముసీ ప్రక్షాళన, గొదావరి, కృష్ణాజలాల సాధన కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన పోరుయాత్ర సోమవారం బీబీనగర్ మండలం ముగ్ధాపురం గ్రామంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జహంగీర్ ప్రసంగించారు. మూసీ జల కాలుష్యంతో ప్రజలు అనేక రకాల రోగాలకు గురవుతున్నారని, జీవరాసులూ కాలుష్యకాసారంతో అంతరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జల్‌శక్తి అభియాన్ పథకం కిందట నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుస్తోందన్నారు. గంగా నది శుద్ధి కోసం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కోసం.. నీధులు కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మూసీ జల కాలుష్య నివారణకు కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలని కోరారు. చిన్నపలుగుతండా, పెద్దపలుగుతండా మధ్యలో ఉన్న బొల్లెపల్లి కాల్వ ద్వారా సాగునీరు అందించి వ్యవసాయానికి, రైతులకు మేలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.