Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమిత్‌షా చెప్పేవన్నీ అబద్థాలే..
- రాజగోపాల్‌రెడ్డి స్వార్ధంతోనే మునుగోడు ఉప ఎన్నిక
- విలేకర్ల సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్
- ఎమ్మెల్యే గాదరి కిశోర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీజేపీ కాళ్లదగ్గర తాకట్టు పెట్టారని ఎమ్మెల్యే గాదరి కిశోర్ విమర్శించారు. హైదరాబాద్‌లో టీఆర్ఎస్ శాసన సభాపక్ష కార్యాలయంలో సోమవారం ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎన్. బాస్కర్‌రావు, భరత్‌తో కలిసియ ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాంట్రాక్టులు, కమీషన్ల కోసమే రాజగోపాల్‌రెడ్డి తన ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని చెప్పారు. మునుగోడు సభలో అమిత్‌షా చెప్పినవన్నీ అబద్ధాలేనన్నారు. రాష్ట్రంలో నిరంతరాయంగా వస్తున్న కరెంట్‌ను రానీయకుండా చేసే కుట్రల్లో భాగంగానే మోటార్లకు మీటర్లు పెట్టబోతున్నారని ఆరోపించారు. భావోద్వేగాలతో రాజకీయాలు చేయాలనుకోవటం ఆ పార్టీకిి వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు. సెప్టెంబర్ 17ను మళ్లీ తెరమీదికి తెచ్చారని గుర్తుచేశారు. దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి ఎక్కడిదంటూ ప్రశ్నించారు. కేంద్రమంత్రి వర్గంలో 22 మంది దళితులు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డవారే ఉన్నారని చెప్పారు. వారిపై కేసులు సైతం నమోదు అయ్యాయన్నారు. అమిత్ షా అండ్ కో ఎన్ని వేషాలేసినా గెలిచేది టీఆర్‌ఎస్సేననీ, రెండోస్థానం కోసమే బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీపడుతున్నాయని చెప్పారు.