Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జీవోనెంబర్ 111 అమలుపై దాఖలైన పిటిషన్లో రెండు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలనీ, ఇదే చిట్టచివరి అవకాశమని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. 2007 నాటి పిటిషన్లో ఇప్పటి వరకు కౌంటర్ వేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ పరీవాహక ప్రాంత పరిరక్షణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదనీ, వాటి రక్షణకు జీవోనెంబర్ 111 అమలు చేయాలంటూ ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ (ఎన్జీవో), ఒమిమ్ మానెక్షా డెబారా పిటిషన్ దాఖలు చేశాయి. దీనిని సోమవారం చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర ్రెడ్డి ధర్మాసనం విచారించింది. జీవోనెంబర్ 111ను సవాల్ చేసిన రిట్లు పెండిం గ్లో ఉండగానే ఆ జీవోను రద్దు చేస్తూ ప్రభుత్వం జీవోనెంబర్ 69 జారీ చేసిం దనీ, దీనిపై అనుబంధ పిటిషన్ వేశామని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. గడువు ఇస్తే కౌంటర్ వేస్తామంటూ గవర్నమెంట్ ప్లీడర్ చెప్పడంపై బెంచ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కోర్టు ఖర్చులుగా రూ.25 వేలు చెల్లిస్తేనే వాయిదా వేస్తామనీ, హైకోర్టు షరతు విధించబోతే హెచ్ఎండీఏ లాయర్ కల్పిం చుకుని జీవోనెంబర్ 111పై వేర్వేరు విరుద్ధ రిట్లు విచారణలో ఉన్నాయనీ, కౌంటర్ పిటిషన్ వేసేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు. దీంతో కౌంటర్ వేయాలని ఆదేశించిన హైకోర్టు విచారణను సెపెంబర్ 14కు వాయిదా వేసింది.
ప్యాలెస్ రిపేర్లకు నిధులు మంజూరు
హైదరాబాద్ నగరంలోని హిల్‌పోర్టు ప్యాలెస్ పునరుద్ధరణ పనుల నిమిత్తం రూ.50 కోట్లు మంజూరు చేసినట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. పనులపై రిపోర్టు ఇచ్చేందుకు ఆరు వారాల సమయం కావాలని కోరింది. ఇందుకు అనుమతిస్తూ హెరిటేజ్ ట్రస్ట్ ఫౌండర్ దీపక్ కాంత్ గిర్ వేసిన పిల్‌పై విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.