Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
''బీసీ మేలుకో -నీ రాజ్యాన్ని ఏలుకో'' అనే దృక్పధంతో బీసీ ప్రముఖ నాయకులు,మేధావులతో ఈ నెల 24న హన్మకొండలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్న ట్టు బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేశ్ తెలి పారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశా రు. రాజ్యాధికారంతోనే బీసీల తల రాతలు మారతాయనీ, ఈ దిశగా పోరాటాలను ఉధృతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.అగ్రవర్ణ రాజకీయ పార్టీలను సీట్లు ఆడగడం మాని సంఘటితమై, బలమైన రాజకీయ నిర్మాణం జరిపితేనే మార్పు సాధ్యమవుతుందని తెలిపారు.