Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద.మ.రైల్వే జీఎమ్ అరుణ్‌కమార్ జైన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రైళ్ల నిర్వహణ, ప్రయాణీకులకు రక్షణకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇంచార్జి) అరుణ్‌కుమార్ జైన్ అన్నారు. సోమవారంనాడిక్కడి రైల్ నిలయంలో ఆయన రైల్వే భద్రతపై ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్ల డివిజినల్ రైల్వే మేనేజర్లు పాల్గొన్నారు. భారీ వర్షాల వల్ల ఏర్పడే ప్రమాదాల నివారణపై ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏఏ జోన్ల పరిధిలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక తనిఖీలతో క్షేత్రస్థాయిలో భద్రతా చర్యలను కచ్చితంగా పాటించేలా చూడాలని ఆదేశించారు. లోకోపైలట్లు, అసిస్టెంట్ లోకోపైలట్లు, భద్రతా సిబ్బందికి ఇస్తున్న శిక్షణ, కౌన్సెలింగ్‌పై వివరాలు అడిగారు. అలాగే వేగ పరిమితులనూ ఆయన సమీక్షించారు.