Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంబీబీఎస్ విద్యార్థుల ధర్నా
నవతెలంగామ బ్యూరో - హైదరాబాద్
నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించిన ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల కారణంగా నష్టపోయిన తమకు న్యాయం చేయాలంటూ ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులు ధర్నా చేపట్టారు. హైదరాబాద్ కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో సోమవారం నిర్వహించిన ధర్నాలో ప్ల కార్డులను ప్రదర్శించి నినాదాలు చేశారు. రెగ్యులర్ పరీక్షల్లో ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు ఎక్కువ మంది ఉత్తీర్ణులు కాగా సప్లిమెంటరీ పరీక్షల్లో ప్రయివేటు కాలేజీ విద్యార్థులు ఎక్కువగా పాస్ అయ్యారని విద్యార్థులు తెలిపారు. దీనిపై పూర్తి విచారణ జరిపి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.