Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు ప్రశాంత్‌రెడ్డి,శ్రీనివాస్‌యాదవ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేసీఆర్ కూతురు కవితపై నిరాధారమైన వార్తలు సృష్టిస్తున్నారనీ, ఇది సరైందని కాదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి,టీఎస్ పుడ్స్ చైర్మెన్ మేడె రాజీవ్‌సాగర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను కేసీఆర్ ఎత్తిచూపుతున్నందుకే ఆయన కూతురుపై నిరాధార వార్తలను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా లీకులిచ్చి వార్తలు రాయిస్తున్నారని ఆరోపించారు. కవిత వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతున్నదని పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయటమే గాక, ఆమె ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయటం హేయమైన చర్చని విమర్శించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడు తున్న టీఆర్ఎస్ పార్టీ నేతలపై, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా భయపడేది లేదని వారు స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ కవిత నిఖార్సైన ఉద్యమకారిణి అని టీఎస్ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్ అన్నారు. ఆమెపై బీజేపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇలాంటి దిగజారుడు చర్యలును మానుకోవాలని బీజేపికి హితవు పలికారు.