Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటినుంచి వెబ్ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమయ్యేనా
- ఇంకా తేలని సీట్ల వివరాలు
- విడుదల కాని ఫీజు ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న తొలివిడత కౌన్సెలింగ్పై డైలమా? నెలకొంది. మంగళవారం నుంచి ధ్రువపత్రాల పరిశీలనతోపాటు వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సోమవారం అర్ధరాత్రి వరకు రాష్ట్రంలో ఎన్ని ఇంజినీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఉన్నది, వాటిలో ఎన్ని సీట్లు ఉన్నాయో జేఎన్టీయూ హైదరాబాద్ సహా ఇతర విశ్వవిద్యాలయాలు ప్రకటి ంచలేదు. దీంతో షెడ్యూల్ ప్రకారమే వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమయ్యేనా? అనే అను మానాలు కలుగుతున్నాయి. ఇంకోవైపు 2022-23 విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్ కోర్సు ఫీజుకు సం బంధించిన ఫీజులు ఇంకా ఖరారు కాలేదు.
ఇప్పటికే తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఫీజులను ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించిన విషయం తెలిసిందే. కరోనా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా గత విద్యా సం వత్సరంలో ఉన్న ఫీజులనే ప్రస్తుత విద్యా సంవత్స రంలోనూ కొనసాగించాలని టీఏఎఫ్ ఆర్సీ కమిటీ నిర్ణయించినట్టు తెలిసింది. అయితే ప్రభుత్వం ఇంకా ఆ ఫీజులను ఆమోదించలేదు. అందుకు సంబంధిం చిన ఉత్తర్వులను విడుదల చేయలేదు. దీంతో ఎంసెట్ ఇంజినీరింగ్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అటు అనుబంధ గుర్తిం పు ఉన్న కాలేజీలతోపాటు సీట్ల వివరాలు, ఇటు ఫీజుకు సంబంధించి స్పష్టత లేకపోవడంతో వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ వాయిదా పడుతుందా? లేక మంగళవారం ఉదయం నాటికి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందా? అనే ఉత్కంఠ అభ్యర్థుల్లో ఉన్నది. ఆదివారం నుంచి ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే.