Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిజామాబాద్‌లో భారీ ర్యాలీతో కలెక్టరేట్ ఎదుట ధర్నా
- బోనాలు, బతుకమ్మ, పోతురాజు విన్యాసాలతో..
- వినూత్న నిరసన ప్రదర్శన
నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
తమకు పే స్కేల్ అమలు చేయాలని, తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 30 రోజులుగా ధర్నా చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై వీఆర్ఏలు కదంతొక్కారు. నిజామాబాద్ నగరంలో మంగళవారం పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక కంఠేశ్వర్ నుంచి ధర్నా చౌక్ వరకు వినూత్న తరహాలో బోనాలతో ప్రధాన చౌరస్తాల వద్ద బతుకమ్మ ఆడుతూ నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఏ జిల్లా జేఏసీ జేఏసీ చైర్మెన్ గైని దయాసాగర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పే స్కేలు జీ.వో ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించాలని కోరారు. లేకుంటే త్వరలో వేలాది సంఖ్యలో హైదరాబాద్‌కు వచ్చి ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ కో చైర్మెన్ బాలరాజ్, వీఆర్ఏ జేఏసీ నాయకులు చెలిమెల రాములు, కన్వీనర్ సాయినాథ్, జనరల్ సెక్రెటరీ గున్నం సంతోష్, కో కన్వీనర్లు పవర్ శైలజ, గంగాధర్ హరిచరణ్, సిలార్ అహ్మద్, ఎరుగం సాయిలు, బి. గంగాధర్ భూమయ్య, అభిలాష్ తదితర వీఆర్ఏలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.