Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ -చిట్యాలటౌన్
ప్రజలకు అత్యంత ప్రమాదకరంగా మారిన బీజేపీని అన్ని విధాలుగా ఒంటరి చేసి ఓడించడమే సీపీఐ(ఎం) ప్రధాన కర్తవ్యమని కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని మేకల లింగయ్య స్మారక భవనంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్ర, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఘట్టాలను వక్రీకరించి మత పరంగా చిత్రీకరించి తారుమారు చేసే దర్మార్గపు చర్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు చెప్పులు తొడగడం ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడమే అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో జుట్టు పన్ను మినహా శ్మశానవాటిక పనులకు సహా పన్నులు విధించిందన్నారు. బ్రిటీష్ ప్రభుత్వానికి మోడీ సర్కార్‌కు తేడా లేకుండా పోయిందన్నారు. గాంధీజీని చంపిన గాడ్సేను కీర్తిస్తున్న బీజేపీ.. రాజ్యాంగ మౌలిక సూత్రాలను విస్మరించి దిగజారిందని విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, మండల కార్యదర్శి అరూరి శీను తదితరులు ఉన్నారు.