Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులో వాదన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు ద్వంద్వ పౌరసత్వం లేదంటూ మంగళవారం హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి. ఆయనపై పోటీ చేసి ఓడిపోయన ఆది శ్రీనివాస్ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో కేంద్రం హౌం శాఖ తీసుకున్న నిర్ణయాలు చట్ట వ్యతిరేకమని రమేష్ లాయర్ వాదించారు. ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత 30 రోజుల్లోగా ఫిర్యాదు చేయాలనీ, అయితే ఆది శ్రీనివాస్ మూడు నెలల తర్వాత ఫిర్యాదు చేశారని తెలిపారు. జర్మనీ పాస్‌పోర్టు మీద ప్రయాణం చేశారని చెప్పి రెండు దేశాల పౌరసత్వం ఉందనడం సరికాదన్నారు. జర్మనీ పాస్‌పోర్టు ఉంటే జర్మనీ పౌరుడు కాదని ఆదేశ రాయబారి కూడా చెప్పారన్నారు. రాజకీయంగా ఎదుర్కొనలేక ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. విచారణ బుధవారానికి వాయిదా పడింది.
ఎన్నికలు నిర్వహిస్తాం
రాజన్న సిరిసిల్ల జిల్లా కోఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లరు సొసైటీకి ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలతో హైకోర్టుకు వచ్చింది. గతంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో రెండు ప్రతిపాదనలను హైకోర్టు ఎదుట పెట్టింది. 3.5 లక్షల మంది సొసైటీ మెంబర్స్ ఉంటే ఎన్నికలు పెట్టకుండా జిల్లా మంత్రి చెప్పుచేతల్లోని వాళ్లతో పాలకవర్గాన్ని కొనసాగిస్తున్నారని సొసైటీ సభ్యుడు కనకరావు రిట్ వేశారు. ఓటర్ల జాబితా రెడీ అయితే నవంబర్ 7న నోటిఫికేషన్ ఇచ్చి 26న ఎన్నికలు, ఓటర్ల జాబితా ఆలస్యమైతే డిసెంబర్6న నోటిఫికేషన్ ఇచ్చి 28న ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఓటర్ల లిస్ట్ కోపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో రెడీ చేయించాలని పిటిషనర్ కోరారు. దీనిపై తమ ఉత్తర్వులను 25న వెలువరిస్తామని చీఫ్ జస్టిస్ బెంచ్ మంగళవారం ప్రకటించింది.