Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర్మ దీక్షను భగం చేసిన పోలీసులు
- కార్యకర్తలు, పోలీసుల తోపులాట, స్వల్ప గాయాలు
నవతెలంగాణ - స్టేషన్‌ఘన్‌పూర్/ వర్ధన్నపేట
కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ను పోలీ సులు మంగళవారం అరెస్ట్ చేశారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం పాం నూర్ గ్రామానికి చేరింది. యాత్రలో భాగంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు చేశారు. బీజేపీ కార్యకర్తలపై దాడి, వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయా లని నిరసనగా విశ్రాంతి శిబిరం వద్ధ ధర్మ దీక్షకు దిగుతున్న నేపథ్యంలో పోలీసులు అడ్డుకుని సంజరును అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమ ంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన కార్యకర్తలు బండి సంజరును తరలిస్తున్న వాహనానికి అడ్డుకో వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీగా పోలీసులు మోహరించి బండి సంజరును బలవంతంగా పోలీసులు వాహనం ఎక్కించారు. పోలీసుల వాహనాన్ని ముందుకు వెళ్లనీయకుండా పార్టీ మహిళా కార్యకర్తలు ఆగ్రహంతో అడ్డుకున్నా రు. పరిస్థితిని అదుపులోకి తీసుకొ చ్చేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్న ం చేశారు. అక్కడి నుండి హుస్నా బాద్ మీదుగా కరీంనగర్ తన ఇం టికి తరలించారు. కాగా, యాత్రలో భాగంగా కేసీఆర్ కుటుంబంపై బండి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతోనే యాత్రను అడ్డుకున్నారు. కాగా, బండి సంజయ్ యాత్ర ను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కర్రలు, నల్ల జెండాలతో, చెప్పులతో 'బానిస సంజరు గో బ్యాక్' అంటూ నినాదాలు చేసుకుంటూ, బండి సంజరు విశ్రాంత శిబిరానికి పరుగు లు తీయగా.. అక్కడే మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అడ్డు కుని చెదరగొట్టారు. తొలుత రోడ్డు వెంబడి వేసిన బీజేపీ పార్టీ ఫ్లెక్సీల ను చింపి వేస్తూ ఆగ్రహంతో రోడ్డు పై నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి, డీసీ సీబీ చైర్మెన్ మార్నేని రవీదర్ రావు, మే యర్ గుండు సుధా రాణి, నియో జక వర్గ టీఆర్ఎస్ నా యకులు, కార్య కర్తలు పాల్గొన్నా రు.
పాదయాత్ర అనుమతులు రద్దు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షు లు బండి సంజరు ప్రజాసంగ్రామ యాత్రను నిలిపివేయాలని వరంగల్ పోలీసు లు మంగళవారం నోటీసులు జారీ చేశారు.