Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏసీబీకి చిక్కిన ఏఎస్ఐ ప్రేమ్‌సింగ్
- వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏసీబీ దాడులు
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పి స్తానని బాధితుడి నుంచి లంచం తీసుకుంటూ వికారాబాద్ ఎస్పీ కార్యాయంలో ఏఆర్ ఏఎస్ఐగా పనిచేస్తున్న ప్రేమ్‌సింగ్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రేమ్‌సింగ్ ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఎస్పీ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఖాళీగా ఉంది. వికారాబాద్ పట్టణం ఎన్నెపల్లికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో తనకు రూ.30వేలు లంచం ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానని ఏఎస్ఐ ప్రేమ్‌సింగ్, శ్రీకాంత్‌రెడ్డితో చెప్పారు. ముందుగా సగం ఎమౌంట్ రూ.15వేలు ఇవ్వాలన్నారు. దాంతో శ్రీకాంత్‌రెడ్డి ఏసీబీ అధికారులను సంప్రదించారు. మంగళవారం ఏఎస్ఐ ప్రేమ్‌సింగ్ శ్రీకాంత్‌రెడ్డి నుంచి రూ.15వేలు లంచం తీసుకుంటుండగా ఏబీసీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే ఈ కేసులో ఏఆర్ డీఎస్పీ కె.సత్యనారాయణకు కూడా సంబంధం ఉన్నట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ సత్యనారాయణను ఏసీబీ అధికారులు విచారించారు. ఏఎస్ఐ కేసు నమోదు చేసి, పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నట్టు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.