Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ పెట్టే కేసులకు భయపడేది లేదు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
ఎమ్మెల్సీ కవితపై దాడిని ఖండిస్తున్నామని, బీజేపీ పెట్టే కేసులకు భయపడేది లేదని, మునుగోడు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లాలోని ఆర్అండ్బి గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ సంస్కృతయిన బతుకమ్మను ఎవరూ పట్టించుకోని సమయంలో కవిత గుర్తింపు తెచ్చారన్నారు. అలాంటి ఆమెపై బీజేపీ దాడి అత్యంత దారుణ మన్నారు. బీజేపీకి కార్యకర్తలు లేకనే బౌన్సర్లను పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు స్వచ్చందంగా వచ్చి బండి సంజ రు యాత్రను అడ్డుకున్నారన్నారు. మోటర్లకు మీటర్లు పెడతామన్న మీరు రైతులకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. దేవురుప్పులలో దాడి చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం జోలికి వస్తే వదిలిపెట్టేదే లేదన్నారు. అనంతరం చీఫ్‌విప్ వినరు భాస్కర్ మాట్లాడుతూ.. 30 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నాగానీ, ఇలాంటి నీచ మైన పార్టీని చూడలేదన్నారు. కొన్ని రోజుల నుంచి బండి సంజరు మత విద్వేషాలను రగిలిస్తూ ప్రభుత్వాలను కూలదోసే కుట్రలు చేస్తున్నా రని విమర్శించారు. మతాల మధ్య చిచ్చు పెడితే రాబోయే రోజుల్లో తగిన శిక్ష తప్పదన్నారు. అనంతరం ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడు తూ.. బండి సంజరు ది ప్రజా సంకల్ప యాత్ర కాదని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే యాత్ర అని అన్నారు. అనేక ఉద్యమాలు చేసిన కవిత ఇంటిపై దాడిని ఖండిస్తున్నామన్నారు. బీజేపీ బలోపేతం కోసం పచ్చగా ఉన్న తెలంగాణలో విషం చిమ్ముతున్నారన్నాని ఆరోపించారు. సమావేశంలో వరంగల్ తూర్పు, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేలు నరేందర్, తాటికొండ రాజయ్య, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మెన్ సుందర్ రాజన్ పాల్గొన్నారు.