Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాసనసభాపక్ష నేత పదవీ తొలగింపు
- ఎందుకు బహిష్కరించకూడదో చెప్పండి
- పదిరోజుల్లో వివరణ ఇవ్వాలని అధిష్టానం ఆదేశం
- ప్రవక్తపై ఆయన చేసిన వ్యాఖ్యలపై దేశమంతటా ఆగ్రహం
- వీడియోను తొలగించిన యూట్యూబ్ ఛానల్
- దేశవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు
- హైదరాబాద్‌లో అరెస్టు..బెయిల్‌పై విడుదల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాలో నానుతుండే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బీజేపీ కేంద్ర నాయకత్వం సస్పెండ్ చేసింది. శాసన సభాపక్ష నేత పదవి నుంచీ తొలగించింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో చెబుతూ పది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రెండో తేదీ కల్లా పార్టీకి తన వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. ఈ మేరకు బీజేపీ కేంద్ర క్రమశిక్షణా కమిటీ లేఖను పంపింది. మ హ్మద్ ప్రవక్తపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారం టూ ఆరోపిస్తూ మైనార్టీ సంఘాలు ఆందోళన బాట పట్టా యి. ఇదే విషయంపై దేశవ్యాప్తంగా పలు పోలీస్స్టేషన్ల లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. మంగళ్‌హాట్ పీఎస్‌లో ఖాదీర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు మంగళవారం ఆయన్ను అరెస్టు చేశారు. బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత భారీ బందోబస్తు మధ్య నాంపల్లి కోర్టుకు తరలించారు. ఆయ నను తీసుకొచ్చే సమయంలో కోర్టు ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆయనకు అనుకూలంగా ఒక గ్రూపు, వ్యతి రేకంగా మరో గ్రూపు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. పోలీసులు ఇరు గ్రూపులను తరిమికొట్టారు. నాంపల్లి 14వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. వెంటనే రాజాసింగ్ లాయర్ బెయిల్ పిటిషన్‌పై వాదించారు. దీనిపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. 41వ సీఆర్పీసీ నిబంధనలు పాటిం చకుండా తన క్లయింట్‌ను అరెస్టు చేశారని రాజాసింగ్ లాయర్ వాదించారు. దీంతో ఏకీభవించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశించింది.
రాజాసింగ్‌కు బెయిల్‌పై ఐపీఎస్లలోనే విస్మయం
వివాదాస్పద వ్ఖ్యాఖ్యలు చేసిన అరెస్టయిన గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కోర్టు నుంచి సులువుగా బెయిల్ రావడం దర్యాప్తు అధికారుల తప్పిదం వల్ల జరి గిందని ఐపీఎస్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. శాంతిభద్రతలకు భారీ ఎత్తున విఘాతం కలిగించే రాజాసింగ్ వీడియో సాగిందనీ, దాని ఆధారంగా సకాల ంలోనే పోలీసులు స్పందించి అతన్ని అరెస్టు చేశారని చెబుతున్నాయి. ఏ నిందితుడినైనా అరెస్టు చేసే సమయ ంలో సుప్రీంకోర్టు నిబంధనలు పాటించాల్సిన నోటీసు ఇవ్వాలనే ఆలోచన దర్యాప్తు అధికారులకు లేకపోవడం విడ్డూరమని అభిప్రాయపడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రాజాసింగ్ అరెస్టు మొదలుకొని అత ను కోర్టు నుంచి విడుదలయ్యే వరకు శాంతిభద్రతల పర ంగా ఎలాంటి విఘాతం తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్న పోలీసు అధికారులు కచ్చితమైన ఈ నిబంధన గురించి మరిచిపోవడం విస్మయం కలిగిస్తున్నదని ఓ రిటై ర్ట్ డీజీపీ అన్నారు. పోలీసు శాఖలోని లీగల్ విభాగాలు ఈ సమయంలో ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.
ఎప్పుడూ వివాదాస్పదమే..
మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా, ఓ మత దైవాన్ని కించపరిచేలా మాట్లాడటంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుండటంతో ఆయన చేసిన వీడియో పోస్టును సంబంధింత యూట్యూబ్ ఛానల్ డిలేట్ చేసింది. తీవ్ర వ్యతిరేకత రావడంతో బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా అనివార్యంగా ఆయనపై సస్పెన్షన్ వేటేసింది. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ప్రధానమనే విధంగా రాజాసింగ్ వ్యవహరిస్తారనే విష యం అధిష్టానం దృష్టిలో ఎప్పటి నుంచో ఉన్నది. ఆయనెప్పుడూ పార్టీకి అంటీము ట్టనట్టే ఉంటానే విమర్శ కూడా ఉంది. తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలతో మీడి యాలో నానుతూనే ఉన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 'బీజేపీకి ఓట్లు వేయకపోతే బుల్డోజర్లతో తొక్కిస్తాం. ఓట్లు వేయని వారిని గుర్తించే పనిలో యోగీ ఉన్నారు. ఆ తర్వాత వారి ఇండ్లను తొక్కియడం ఖాయం' అంటూ రాజాసింగ్ వ్యాఖ్య లు చేయడంతో అప్పట్లో భారత ఎన్నికల సం ఘం కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. 72 గంటల పాటు ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టకుండా, ఎన్నికలపై మా ట్లాడ కుండా ఆదేశాలను కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.
పార్టీలోనూ కీలకనేతలతోనూ పొసగని వైనం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్, రాజాసింగ్ మధ్య అంత సఖ్యత లేదనే ప్రచారం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా 'బండి సంజరు కుమార్ నన్ను తొక్కేస్తున్నాడు.. కనీసం నా ఒక్క నియోజకవర్గంలోనైనా నేను చెప్పిన వారికి టిక్కెట్లు ఇవ్వలేదు. చివరకు నియోజకవర్గంలో నా గెలుపునకు కృషి చేసిన వారికి కూడా న్యాయం చేయలేకపోతున్నా' అంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలోనే అతని అనుచరులు బీజేపీ ఆఫీసులో నానా హంగామా సృష్టించారు. కుర్చీలు విరగ్గొట్టారు. పరిస్థితి కొట్టుకునే దాకా వెళ్లింది. ఒకానొక దశలో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర అధిష్టానం సీరియస్ అయింది. దీంతో రాజాసింగ్ కొద్దిగా వెనక్కి తగ్గి స్తబ్దుగా ఉన్నాడు. అయితే, నేతలంతా కలిసికట్టుగా ఉన్నట్టు పైకి కనిపిస్తున్నప్పటికీ కీలకనేతలతో ఆయన వైరుధ్యం అలాగే కొనసాగుతూ వస్తున్నది. హైదరాబాద్ పార్లమెంటరీ స్థానంలో తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడంపై నా అలిగారు.
ఆ సమయంలో బీజేపీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ తమ ఎంపీ అభ్యర్థులైన కిషన్‌రెడ్డి, భగవంతరావు ప్రచారంలో ఒక్కరోజు కూడా పాల్గొనకపోవడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. పార్టీ కంటే హిందూత్వ ధర్మమే తనకు ముఖ్యమనే ధోరణిలో తన వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకుంటాడు తప్ప పార్టీ పటిష్టం కోసం రాజాసింగ్ కృషి చేయడని గతంలోనే రాష్ట్ర నాయకత్వం ఆయనపై కేంద్రానికి ఫిర్యాదు చేసినట్టు ప్రచారముంది. రాజాసింగ్ విషయంలో వరుసగా జరుగుతున్న పరిణామాలపై అధిష్టానం సున్నితంగా గమనిస్తూ వస్తున్నది. అందులో భాగంగానే ఈ వేటు అనే ప్రచారం జరు గుతున్నది. అయితే, ప్రస్తుత వ్యాఖ్యలను, గతంలోని కారణాలను చూపెట్టి పార్టీ సస్పెండ్ చేసిందా ? మునుగోడు ఉప ఎన్ని కల వేళ తమ పార్టీకి ఒక హైప్ తీసుకొచ్చేందు కు బీజేపీ కేంద్ర నాయక త్వం ఇలా వ్యవహరిస్తుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న రాజాసింగ్
- శాసనసభ్యత్వాన్ని రద్దు చేసి క్రిమినల్ చర్యలు చేపట్టాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
బీజేపీ శాసనసభ్యుడు రాజాసింగ్ మత విద్వేషాల ను రెచ్చగొడుతూ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడు తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మహమ్మద్ ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యలు చేసి రాష్ట్రంలో శాంతిభద్రతల కు, మత సామరస్యానికి విఘాతం కల్పిస్తున్నారని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి గాను బీజేపీ అధినాయకత్వం పార్టీ నుంచి రాజాసింగ్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడంతోనే సరిపోదని పేర్కొన్నారు. అతన్ని పార్టీ నుండి తక్షణమే బహిష్కరించాలనీ, శాసనసభ సభ్యతాన్ని రద్దు చేసి, చట్టరీత్యా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక శాసనసభ్యుడిగా బాధ్యతాయుతంగా వ్యహరించాల్సిన రాజాసింగ్ ప్రతీసారి ప్రజలను మత ప్రాతిపదికన చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తరచుగా ఆయన ప్రకటనలు విద్వేషపూరితంగా, హిందూ, ముస్లింలను రెచ్చగొట్టేలా ఉంటున్నాయని వివరించారు. ఈ మధ్య శిల్పారామంలో జరిగిన మునావర్ షో సందర్భంగా కూడా ఇదే విధంగా ప్రవర్తించారని గుర్తు చేశారు. మంగళవారం అరెస్టు చేసిన తర్వాత కూడా ఆయన పద్ధతి మార్చుకోకుండా పోలీసు స్టేషన్లో ఉండీ రెండో వీడియోనూ విడుదల చేస్తానంటూ చెప్పారని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే అతని విద్వేష రాజకీయాలు ఎంతటి పరాకాష్టకు చేరాయో అర్థమవుతున్నదని పేర్కొన్నారు. నుపూర్‌శర్మ వివాదస్పద వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన తర్వాత కూడా బీజేపీ నాయకత్వం మాటల్లో, చేతల్లో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హమని తెలిపారు. దీన్ని బట్టి ఇది బీజేపీ ప్రణాళికలో భాగంగానే చూడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇది దేశానికి చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ శాసనసభ ప్రతిజ్ఞకు భిన్నంగా వ్యవహరించి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన నేపథ్యంలో అతని శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని తమ్మినేని డిమాండ్ చేశారు.