Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 26 మంది అరెస్ట్
నవతెలంగాణ-బంజారా హిల్స్
ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ నేతల దాడి కేసులో మొత్తం 29 మందిపై కేసు నమోదు చేశామని, 26 మందిని మంగళవారం అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ఎదుట వర్చువల్గా హాజరు పరిచామని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు తెలిపారు. నిందితులపై సెక్షన్ 341, 147, 148, 353, 332, 509, రెడ్ విత్ 149 కింద కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. కాగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘు నందన్రావు పోలీస్ స్టేషన్కు వచ్చారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన తర్వాత నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.