Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాజకీయ ప్రత్యర్థుల్ని బీజేపీ వేధిస్తున్న తీరు పూర్తిగా ఆక్షేపణీయమని నిజామాబాద్ ఎమ్మెల్యే, టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. మంగళవారంనాడాయన టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవితపై బీజేపీ నేతలు అవినీతి ఆరోపణలు చేయడం, ఆమె ఇంటిపై దాడికి యత్నించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీ రాజకీయ పార్టీగా కాకుండా, రాబందుల పార్టీలా మారిందని విమర్శించారు, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్షా, ఈడీలకు ఎవ్వరూ భయపడరని అన్నారు.