Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'న్యాక్' ఉచిత కోర్సు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
బీటెక్, బీఈ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఎస్సీ, బీసీ-సీ తరగతికి చెందిన అభ్యర్థులకు 'న్యాక్' మూడు నెలల పాటు భోజన వసతితో కూడిన ఉచిత కోర్సు నిర్వహించనుంది. హైదరాబాద్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్సస్ట్రక్షన్(న్యాక్), తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ కోర్సును అందిస్తున్నాయి. ఈ మేరకు న్యాక్ ఉన్నతాధికారులు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మూడు నెలల ఫీనిషింగ్ స్కూల్ ప్రోగ్రాంలో అత్యుత్తమ నిపుణుల పర్యవేక్షణలో శిక్షణతో పాటు ఉచితంగా భోజన వసతి కల్పించనున్నట్టు చెప్పారు. కోర్సు అనంతరం సంబంధిత బహుళ జాతి, ఇతర కంపెనీల్లో ఉపాధి అవకాశం కల్పించేందుకు అభ్యర్థులకు సాయం చేస్తామని స్పష్టం చేశారు. ఆసక్తి కల్గిన అభ్యర్థులు న్యాక్ అధికారి భార్గవచారిని మొబైల్ ఫోన్ నెంబరు 7097114947 ద్వారా సంప్రదించవచ్చని తెలియజేశారు.