Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలస్యంగా వెలుగులోకి..
- బాధితురాలికి న్యాయం చేస్తాం: తొర్రూరు డీఎస్పీ రఘు
నవతెలంగాణ-నెల్లికుదురు
బాలికపై ముగ్గురు లైంగికదాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని, పూర్తి విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేస్తామని మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డీఎస్పీ రఘు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ పత్తిపాక జితేందర్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ.. ఓ మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు చేసిన సంఘటన మండలంలో చోటు చేసుకోవడంతో వెంటనే పోలీసు బృందం టీంలుగా ఏర్పడి న్యాయవిచారణ జరిపేందుకు సిద్ధమైనట్టు తెలిపారు. ఈ ఘటన విషయాలు తెలుసుకునేందుకు సంఘటనా స్థలానికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించినట్టు తెలిపారు. సమగ్రంగా విచారణ జరిపి బాలికకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తున్నామన్నారు. నిందితులకు శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ సిబ్బంది తెలిపారు.