Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనస్తాపంతో రైతు ఆత్మహత్య
నవతెలంగాణ - ఓదెల
తాను సాగు చేసిన వరి విత్తనాల ధాన్యం డబ్బులు ఇవ్వకపోగా.. బయో సీడ్ కంపెనీ ఆర్గనైజర్లు వేధింపులకు గురిచేయడంతో రైతు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో మంగళవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. ఓదెల మండలంలోని గుంపుల గ్రామానికి చెందిన మేకల సారయ్య(55) తన రెండెకరాల భూమిలో యాసింగి సీజన్లో బయో సీడ్ కంపెనీకి చెందిన వరి విత్తనాలను సాగు చేశాడు. ఈ సీడ్‌ను కంపెనీ ఆర్గనైజర్ మొగిలి, సబ్ ఆర్గనైజర్ కమ్మచిచ్చు మహేష్ సారయ్యకు ఇచ్చారు. వరి ధాన్యాన్ని కంపెనీ తీసుకెళ్లి మూడు నెలలు కావస్తోంది. ఇంకా ధాన్యం డబ్బులు రూ.లక్ష ఇవ్వాల్సి ఉండగా ఆర్గనైజర్ మొగిలి, సబ్ ఆర్గనైజర్ మహేష్ సారయ్యను వేధింపులకు గురిచేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సారయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సారయ్యకు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పొత్కపల్లి ఎస్ఐ శీలం లక్ష్మణ్ తెలిపారు.