Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోలేటి దామోదర్ విమర్శ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కేంద్ర దర్యాప్తు సంస్ధ(సీబీఐ) ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) తదితర స్వతంత్ర సంస్ధలను కేంద్రప్రభుత్వం కీలుబొమ్మలుగా మార్చిందని తెలంగాణ రాష్ట్ర పోలీసు గహ నిర్మాణ సంస్ధ ఛైర్మెన్ కోలేటి దామోదర్ విమర్శించారు. రాజకీయ ప్రత్యర్ధులే లక్ష్యంగా స్వతంత్ర సంస్ధల ప్రతిష్టను మసకబారుస్తున్నదని వ్యాఖ్యానించారు. నేరారోపణలు లేకుండానే దర్యాప్తు పేరుతో రాజకీయ ప్రత్యర్ధులను వేధించడం బీజేపీ దివాళాకోరు రాజకీయాలకు పరాకాష్ట అని ఆరోపించారు. శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితపై బీజేపీ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన తప్పుబట్టారు. కేంద్రంపై పోరాడుతున్న కేసీఆర్ను భయపెట్టేందుకే కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నదని అభిప్రాయపడ్డారు. కవిత ఇంటిపై బీజేపీ గుండాలు దాడీ చేయడాన్ని ఖండించారు. తెలంగాణకు సంబంధించి సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీగాని, కేంద్ర హోంమంత్రి అమిత్షా గానీ సమాధానం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. బీజేపీ నేతలు అబద్దాలు చెబుతూ పాదయాత్రలు చేస్తున్నారనీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.