Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం), సీపీఐకి వీఆర్ఏల జేఏసీ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట గురు, శుక్రవారాల్లో నిర్వహించే 48 గంటల మహాధర్నా, వంటావార్పు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరాలని వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఎస్కే దాదేమియా, కో-కన్వీనర్లు వై.వెంకటేశ్‌యాదవ్, వంగూరు రాములు, మాధవ్నాయుడు, ఉమామహేశ్వర్రావు పిలుపునిచ్చారు. తమ పోరాటానికి మద్దతు తెలపాలని కోరుతూ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్రెడ్డికి వీఆర్ఏ జేఏసీ బుధవారం వినతి పత్రాలు అందజేసింది. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన పే స్కేల్, అర్హులకు పదోన్నతులు, వారసత్వ ఉద్యోగాల హామీ నెరవేర్చాలని నెల రోజులుగా సమ్మె చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో సమ్మెను ఉధృతం చేయబోతున్నామని వివరించారు.