Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాంధీలో అరుదైన శస్త్రచికిత్స
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్లోని గాంధీ ప్రభుత్వాస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్సను డాక్టర్లు విజయవంతంగా నిర్వహించారు. గురువారం ఒక రోగి స్పహలోనే ఉండగానే మెదడులోని కణితిని (ట్యూమర్) డాక్టర్లు తొలగించారు.న్యూరోసర్జరీ విభాగం, అనేస్తేషియా విభాగానికి చెందిన వైద్యులు సంయుక్తంగా ఈ శస్త్రచికిత్స నిర్వహణలో పాల్గొన్నారు. ఈ ఆపరేషన్ సుమారు రెండు గంటల పాటు జరిగింది. ఆ సమయంలో రోగి వైద్యులతో మాట్లాడుతూ సినిమా చూశారు. ఆ సమయంలో డాక్టర్లు రోగి మెదడులోని కణతిని సులభంగా తొలిగించారు. ఈ శస్త్రచికిత్సను అవేక్ క్రేనియటోమి అని అంటారని డాక్టర్లు తెలిపారు.న్యూరోసర్జరీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ప్రకాష్ రావు ఆధ్వర్యంలో డాక్టర్ ప్రతాప్ కుమార్ , డాక్టర్ నాగరాజు, అనేస్తేషియా విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ సారయ్య, డాక్టర్ ప్రతీక్ష, డాక్టర్ అబ్బయ్య, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యులు డాక్టర్ కిరణ్ , డాక్టర్ గిరీష్ , డాక్టర్ యామిని , డాక్టర్ స్ఫూర్తి, స్టాఫ్ నర్సులు సిస్టర్ రాయమ్మ , సవిన, రజిని, సుమ వార్డ్ బార్సు నవీన్, వెంకన్న శస్త్రచికిత్స నిర్వహణలో పాల్గొన్నట్టు ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది.