Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.వెయ్యి కోట్ల వరకు విద్యార్థులకు అందిస్తాం
- శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారతదేశంలో స్కోర్ స్టెమ్ ఛాలెంజ్ స్కాలర్షిప్-2022 పేరుతో అతిపెద్ద స్కాలర్షిప్ పరీక్షను నిర్వహిస్తున్నామని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్, ఇన్ఫినిటీలెర్న్ కోఫౌండర్ సుష్మ బొప్పన చెప్పారు. శుక్రవారం హైదరాబాద్లో అందుకు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్, నీట్ వంటి ప్రవేశ పరీక్షల కోసం చూస్తున్న విద్యార్థులకు ఆన్లైన్, ఆఫ్లైన్లో స్కాలర్సిప్ పొందాలనుకునే వారికి ఇది మంది వేదిక అని అన్నారు. 1 నుంచి 13 తరగతుల విద్యార్థులకు రూ. వెయ్యి కోట్ల విలువైన స్కాలర్షిప్లతోపాటు ఆకర్షనీయమైన బహుమతులను గెలిచేందుకు అవకాశముందన్నారు. శ్రీచైతన్య స్కూల్స్ అకడమిక్ డైరెక్టర్, ఇన్ఫినిటీలెర్న్ కో ఫౌండర్ సీమ మాట్లాడుతూ నాణ్యమైన విద్య పొందలేని వారికి తమ సంస్థ ఎల్లప్పుడూ అవకాశాలను కల్పిస్తుందని అన్నారు. ఆన్లైన్ (https://infinitylearn.com/score)లో ఈనెల 26 నుంచి నవంబర్ 30 వరకు, ఆఫ్లైన్లో సెప్టెంబర్ 18, అక్టోబర్ 16, నవంబర్ 13న స్కోర్ స్టెమ్ ఛాలెంజ్ పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. ఈ ఫలితాలను డిసెంబర్ 15న ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫినిటీలెర్న్ సీఈవో, ప్రెసిడెంట్ ఉజ్వల్సింగ్ తదితరులు పాల్గొన్నారు.