Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎడ్‌లో 83 శాతం ప్రవేశాలు వారికే
- అబ్బాయిలు 17 శాతానికే పరిమితం
- మేడ్చల్‌కు చెందిన మోహంతి టాపర్
- ఎడ్‌సెట్‌లో 96.84 శాతం ఉత్తీర్ణత
- ఫలితాలు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీఎడ్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్ ఫలితాలను శుక్రవారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి విడుదల చేశారు. ఎడ్‌సెట్‌కు 38,091 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో 31,578 మంది రాతపరీక్షకు హాజరయ్యారు. 30,580 (96.84 శాతం) మంది అభ్యర్థులు ఉతీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో అమ్మాయిలు హవా కొనసాగించారు. ఉత్తమ ప్రతిభ కనబరచడంలోనూ, ఎక్కువ మంది దరఖాస్తు చేయడంలోనూ వారే ముందంజలో ఉన్నారు. బీఎడ్ కోర్సులో 83 శాతం ప్రవేశాలు అమ్మాయిలకే దక్క నుండడం గమనార్హం. అంటే అబ్బాయిలకు కేవలం 17 శాతం సీట్లు పొందను న్నారు. ఎడ్‌సెట్‌లో 31,379 మంది అమ్మాయిలు దరఖాస్తు చేయగా, 26,165 మంది పరీక్ష రాశారు. వారిలో 25,246 (96.49 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 6,712 మంది అబ్బాయిలు దరఖాస్తు చేస్తే, 5,413 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 5,334 (98.54 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. కనీస అర్హత మార్కుల్లేనందున పరీక్షకు హాజరైన ఎస్సీలు 7,181 మంది, ఎస్టీలు 4,347 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇతరులకు 25 శాతం అంటే 38 మార్కులు సాధిస్తేనే ఎడ్‌సెట్‌లో అర్హత సాధిస్తారు. బీసీ-ఏలు 2,150 మంది పరీక్ష రాస్తే, 2,018 (93.86 శాతం), బీసీ-బీలు 5,560 మంది పరీక్ష రాయగా 5,265 (94.70 శాతం), బీసీ-సీలు 142 మందికి రాస్తే, 138 (97.18 శాతం), బీసీ-డీలు 5,862 మంది పరీక్షకు హాజరుకాగా, 5,517 (94.11 శాతం), బీసీ-ఈలు 3,654 మంది పరీక్ష రాయగా, 3,501 (95.83 శాతం), ఓసీలు 2,682 మంది పరీక్ష రాస్తే, 2,613 (97.42 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ర్యాంకు కార్డుల కోసం ష్ట్ర్‌్‌జూర:// వసషవ్. ్‌రషష్ట్రవ. aష.ఱఅ వెబ్‌సైట్‌ను చూడాలని ఎడ్‌సెట్ కన్వీనర్ ఎ రామకృష్ణ సూచించారు. గత విద్యాసంవత్సరంలో 213 బీఎడ్ కాలేజీల్లో 19,100 సీట్లున్నాయని వివరిం చారు. ఇందులో పది ప్రభుత్వ కాలేజీల్లో 1,050 సీట్లు, ప్రయివేటు కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 13,500 సీట్లున్నాయని చెప్పారు. కాలేజీలకు అనుబంధ గుర్తింపు వచ్చిన తర్వాత ప్రవేశాల షెడ్యూల్‌ను విడుదల చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ డి రవీందర్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, ఎడ్‌సెట్ కోకన్వీనర్ శంకర్, ప్రవేశాల కన్వీనర్ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.