Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- constable to collector
సుమారు దశాబ్దం తర్వాత స్వరాష్ట్రంలో మొట్టమొదటి సారిగా గ్రూప్ -1 మొదలుకొని,S. I, Police constable, Group - IV వరకు ఉద్యోగ నోటిఫికేషన్స్ ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థులు ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొని విజేతగా నిలబడాలంటే ఆయా ఉద్యోగాల సిలబస్‌కు అనుగుణంగా తమ ప్రిపరేషన్‌ను తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి మనం అన్ని ఉద్యోగ నోటిఫికేషన్స్ పరిశీలిస్తే కొన్ని ముఖ్యమైన అంశాలను గుర్తించవచ్చు. అందులో భాగంగా జుఅస్త్రశ్రీఱరష్ట్ర లాంగ్వేజ్ కూడా ఉద్యోగ సాధనలో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఇంగ్లీష్ భాషపై సిలబస్‌కు అనుగుణంగా పట్టు సాధించడం అత్యంత అవశ్యకం.
రాష్ట్రంలో విడుదలవుతున్న విభిన్న నోటిఫికేషన్స్‌లో English భాషకు ఉన్న మార్కుల ప్రాధాన్యత వెయిటేజ్ ఈ క్రింది విదంగా ఉంది.
పోటీ పరీక్ష - మార్కుల వెయిటేజ్
1. టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష- 20 మార్కులు
ఎస్ఐ మెయిన్స్ పేపర్ - 150 మార్కులు
గ్రూప్- 1 మెయిన్స్ పేపర్-150 మార్కులు
గ్రూప్ -2(జీ.ఎస్ పేపర్)-20-25 మార్కులు
గ్రూప్ 3 మరియు 4- 15-20 మార్కులు
టీఎస్పీఎస్సీ జేఎల్, డిఎల్, గురుకుల ప్రిలిమ్స్ - 20-25 మార్కులు
ఆల్ టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్
(ఫారెస్ట్, ఏఈవో, డీఏవో మరియు అన్నీ ఇతర రాష్ట్ర కాంపిటేటివ్ పరీక్షలు)20-25 మార్కులు
ఎలా చదవాలి ?
ఉమ్మడిగా పైన పేర్కొన్న సిలబస్‌ను క్షుణ్ణంగా పరిశీలించి అన్నింటిలో సాధారణంగా ఉండే అంశాలను గుర్తించి దాని కనుగుణంగా మీ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.
మార్కెట్లో ఉండే అన్ని పుస్తకాలను కొని గందరగోళానికి గురికాకుండా ప్రామాణికమైన పుస్తకాలను చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా పదవ తరగతి స్థాయిలో ఉన్న ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాల్లోని గ్రామర్ సంబంధిత అంశాలను, పదాలు, వాటి అర్థాలు, పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు, జాతీయాలు, సామెతలు లాంటి వాటిపై దష్టి సారించాలి.
గతంలో జరిగిన తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించిన గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4, గురుకుల, ట్రాన్స్‌కో, హెల్త్, ఫారెస్టు మరియు యానిమల్ హస్బెండరీ లాంటి డిపార్ట్మెంట్ల పోటీ పరీక్షల గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే ఈ క్రింది విధంగా ఒక్కొక్క అంశానికి ప్రాధాన్యతను మనం గమనించవచ్చు.
ఏయే అంశాలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి?
Smart plan for good scoring in English Language.
The following are the core areas in the upcoming competitive Examinations.
1. Subject - Verb agreement, Conditionals and Tenses - ఈ మూడు టాపిక్స్ నుండి 2-3 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా ఇంగ్లీష్ వాక్య నిర్మాణానికిSubject - verb - Agreement ఎంత ప్రధానమో ప్రధాన క్రియా రూపాలు, నిజ జీవితంలో టెన్సెస్ యొక్క వాడుక, దాని ప్రత్యేకతలు, structure patterns, conditional tenses యొక్క usage నిజ జీవితంలో ఎలా అన్వయించుకుంటామో గమనించదగిన అంశాలు.
2. Articles and Prepositions- టాపిక్స్ నుండి 1-2 questions will be asked on the usage of A, An and the, the omission of Articles or Zero Articles మరియుPreposition topic నుండి correct use of preposition and words followed by prepositions, prepositions types పైన ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది.
3. parts of speech నుండి 1-2 questions will be asked indepth, rather than Identifying the parts of speech.
The candidates have to focus on correct usage of Nouns & pronouns, Adjectives, Adverbs -Correct order of Adverbs.
Types of Conjunctions- Co-ordinating, co-relative and Superlative conjunctions and its appropriate usage in day- to- day life.
4.Transformation of sentences నుండి 2-3 మార్కులను Rules and usage of Reported speech, change of Voice from Active to passive vice- verse.
Degrees of Comparison, different forms of Adjectives, transformation/change of sentences from Positive Degree to Comparative Degree, Comparative Degree to Superlative Degree. and need to learn the correct usage of comparisons.
5.Question Tags - 1 Mark.
In this topic sometimes the question may be asked in colloquial language to test the candidates communicative competence in language usage.
6. Phrases and clauses will be given for 1 Mark.
7. Reading comprehension - a prose Comprehension will be given to the reading abilities of the candidates.- In answering comprehension questions, one must follow the strategies & techniques, practice is compulsory to get maximum marks. In this topic Understanding the theme /concept, reasons are important, new phrases, words & Vocabulary tested from the passage directly or indirectly.
8. Language skills and Composition : In this part questions Will be asked from Letter writing, Precis writing, Paragraph writing, Translations, Essay writing etc.-Special focus is needed to improve communication, Reading and writing to score marks.
9. Spotting of Errors: Finding an error in the given sentences, contextual usage of prepositions, Articles, parts of speech- usage of Nouns, pronouns, Adjectives and Adverbs, different Conditionals, Singular, plural, verb forms, S-V-O pattern, Basic Structures of Simple sentences etc.
10 .Word power : In Vocabulary part Synonyms, Antonyms, Root words, suffixes, prefixes, Homophones, Homographs, Homonyms, Phrasal verbs, Idiomatic expressions, proverbs, one-word substitutes, Active and Passive vocabulary from School texts etc.
11. Word grammar లో ప్రదానంగా a. Spelling b. Commonly misspelt words c. Silent lettersపై ఫోకస్ చెయ్యాలి.
Basic Englishలో భాగంగా అభ్యర్థులు ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలపై దృష్టి సారించాలి. అందులో ప్రధానంగా Helping verbs, Model Auxiliaries, Non-finite verbs, Gerunds, participles and Infinitives. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ లో లాంగ్వేజ్ ఫంక్షన్స్ పైన మరియు colloquial Language పైన ప్రశ్నలు అడుగుతున్నారు. ముఖ్యంగా గ్రామర్ రూల్స్ పైన మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని నిజజీవితంలో ప్రతి రోజు ఎలా వాడుతున్నారు అనే అంశాలపైన (Practing/Usage of the English language in Day to Day life) ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది.
సంప్రదించవలసిన గ్రంధాలు
1. High school English grammar & Composition by Wren and Martin
2. Essential English grammar by Raymond Murphy (for practice)- Cambridge university press.
3. Intermediate English grammar by Raymond Murphy(For practice )-Cambridge university press.
4. Advanced English grammar by Martin Hewings -Cambridge university press.
5. School level English text books and Intermediate English text books by Government of Telangana.
రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కొలువుల సందడి నెలకొంది. దాదాపు 15వేల పై చిలుకు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సుమారుగా 6,61,196 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. పరీక్ష సమయం సమీపించడంతో అభ్యర్థులు తమ రివిషన్ ప్లాన్ ను సమీక్షించుకుంటూ ప్రిపరేషన్ ను ముందుకు తీసుకెళ్లాలి. 200 మార్కులకు నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షలో ఇంగ్లీష్ భాషకు 20 మార్కుల వెయిటేజ్ ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు ఇంగ్లీష్ పోభియా ను విడనాడాలి.
చాలా మంది తెలుగు మీడియం గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఇంగ్లీష్ లో చేసే ప్రధానమైన ఏమిటంటే ఇచ్చిన ప్రశ్నలను చదవకుండానే ఏదో ఒక సమాధానాన్ని గుర్తించడం లేదా ఇంగ్లీష్ లో ఉన్న ప్రశ్నను చూసి పెద్దగా ఉందని చదవకుండానే వదిలివేయడం. అలా కాకుండా ఇచ్చిన ప్రశ్నలను చదివి అర్ధం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. ఎక్కువ సమాధానాలు గుర్తించే విధంగానే సులువుగా ఉంటాయి. కానీ ప్రశ్నను చదవక పోవడం, పొడవైన వాక్యాలను, సమాధానాన్ని చదవకుండానే గుర్తించడం, నెగెటివ్ మార్కింగ్ ఉందనే భయం వీడండి. చాలా వరకు ప్రశ్నలు పదవ తరగతి స్థాయిలోనే వస్తున్నాయి. కాబట్టి పరీక్ష ముందు కొత్త అంశాలను చదవకుండా, చదివిన అంశాలనే పునఃచ్చరణ చేసుకోవడం మంచిది. ప్రతీ ఒక్క మార్కు మిమ్మల్ని మీ విజయానికి చేరువ చేస్తుంది కాబట్టి ఏ అంశాన్ని వదిలి పెట్టకుండా అన్ని సబ్జెక్ట్స్ పైన ఫోకస్ పెట్టండి. ఎక్కువ మార్కులు ఉన్న అంశాలకే మొత్తం సమయాన్ని కేటాయించి మిగతా వాటిని నిర్లక్ష్యం చెయ్యవద్దు. రోజుకి ఎన్ని గంటలు చదివామన్నది కాకుండా ఎగ్జామ్ హాల్ లోని 3 గంటల సమయం చాలా కీలకం. నెగెటివ్ మార్కింగ్ భయం వీడండి, ముందుగా అన్ని ప్రశ్నలను చదివి మొదటగా తెలిసిన అన్ని అంశాలకు సమాధానాలు గుర్తించి రెండవ రౌండ్ లో కఠినమైన, వదిలివేసిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి. పరీక్ష హాల్ లో ఎట్టి పరిస్థితి లోను ప్రతి కూలమైన ఆలోచనలతో ఉండవద్దు.ఆత్మ విశ్వాసమే మీ విజయానికి పునాది.
Wish you all the best.
Thirupathi patel saire (Director)
Careerwin Academy Hyd. Cont: 9985784858
(The Author is a Research scholar in the Department of English Osmania University & A Doctoral fellow at Ministry Higher Education (MHRD) Govt. Of India.)