Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు రాజీనామానా?
- గులాంనబీ ఆజాద్‌పై టీపీసీసీ నేతల ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్‌లో ఒక సామాన్య కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించి రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, కీలకమైన సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఎన్నో పదవులు అనుభవించి ఇప్పుడు రాజీనామా చేస్తారా? అంటూ గులాంనబీ ఆజాద్నుటీపీసీసీప్రశ్నించింది. పార్టీ సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, మహేష్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్‌యాదవ్, మహేశ్వర్‌రెడ్డి, సంపత్‌కుమార్, మల్లు రవి, అనిల్ ఈమేరకు శుక్రవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అన్ని అవకాశాలు, పదవులు అనుభవించిన ఆజాద్ స్వార్థపూరితంగా ఇప్పుడు రాజీనామా చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతతత్వ చర్యల ద్వారా దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర చేస్తున్నదని విమర్శించారు. తద్వారా రాజకీయ లబ్ది పొందేందుకు ఆయా శక్తుల కుట్రలో భాగంగా ఆజాద్ రాజీనామా చేశారని ఆరోపించారు. బీజేపీ వ్యతిరేక రాష్ట్రాలను బలహీనపరిచేందుకు ఆపార్టీ బ్లాక్మెయిల్ రాజకీయాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 4న ఏఐసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని రాంలీల మైదానంలో నిరసనగా ప్రదర్శన చేయనున్న నేపథ్యంలో ఆ నిరసన ప్రదర్శనను దెబ్బతీసే కుట్ర లో భాగమే ఆజాద్ రాజీనామా చేశారని విమర్శించారు. సెప్టెంబర్ 7న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ భారత్ జూడో యాత్ర ఉన్న నేపథ్యంలో దాన్ని భగం చేసేందుకే ఆజాద్ ఇలా రాజీనామా చేసి సంక్షోభం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వారు పేర్కొన్నారు.