Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ తమిళి సై సౌందరరాజన్
నవతెలంగాణ-కల్చరల్
ప్రపంచంలోనే భాష పేరిట విశ్వ విద్యాలయం అరుదని, తెలుగు విశ్వ విద్యాలయం ఒక్కటే భాష పేరుతో బా సిల్లుతోందని గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. తెలుగు వారికి తమిళులకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందన్నారు. చెన్నైలో ప్ర ముఖ తెలుగు నటులు, కళాకారులు ఎందరో నివాసం ఉంటున్నారని చె ప్పారు. హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళా మందిరంలో మండలి వెంకట కృష్ణా రావు సంస్కృతి పురస్కారం- 2022' పురస్కారాన్ని ప్రొఫెసర్ సీఎంకే రెడ్డికి గవర్నర్ చేతులమీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తెలుగులో ప్రసంగించారు.
చెన్నైలో నివాసం ఉండి వైద్య వృత్తి చేస్తూ కళా సాగర్ సంస్థ ద్వారా తెలుగు వికాసా నికి రెడ్డి చేస్తున్న కృషి ప్రశంసనీయమ న్నారు. మండలి కృష్ణారావు తెలుగు భాషా పరిరక్షణకు విశేష కృషి చేశారని, తొలి ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ, గాంధీ మార్గం లో రాజకీయవేత్తగాను గుర్తింపు తె చ్చుకొన్నారని కొనియాడారు. విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య కిషన్‌రావు మాట్లాడుతూ.. పుర స్కార గ్రహీత ప్రొఫెసర్ రెడ్డి వైద్య వృత్తితో సమానంగా తెలుగు భాషా పరిరక్షణ ను ఉద్యమంగా నడిపిస్తున్నా రని వివరించారు. అంతర్జాతీయ తెలుగు కేంద్రం సంచాలకులు రెడ్డి శ్యామల పురస్కారం వివరాలను తెలి పారు. మండలి కృష్ణారావు కుమారు డు, పురస్కార స్థాపకుడు మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్న సభకు రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ స్వాగతం పలికారు.