Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీకి కేటీఆర్ ట్వీట్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రానికి ఎన్ని కాలేజీలు మంజూరు చేశారో చెప్పాలంటూ ప్రధాని మోడీని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. వైద్యవిద్యలో సీఎం కేసీఆర్ చరిత్ర సష్టించారని పేర్కొన్నారు. తెలంగాణలో 2014కు ముందు 67 ఏండ్ల కాలంలో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మాత్రమే ఏర్పాటు చేశారన్నారు. కానీ గత ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ కొత్తగా 16 వైద్య కళాశాలలు మంజూరు చేశారని వెల్లడించారు. జిల్లాకు ఒకటి చొప్పున మరో 13 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సంగారెడ్డి, మహబూబ్నగర్ మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి కావొచ్చిందన్నారు. ఇక వనపర్తి, రామగుండం, జగిత్యాలలో వైద్య కళాశాలల నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పారు. త్వరలో కొత్తగూడెం మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నామని మంత్రి వెల్లడించారు.