Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు మహిళలు మృతి
- మరో ఇద్దరి పరిస్థితి విషమం
- మృతదేహాలతో బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన
- బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ
- ముందస్తుగా రూ.లక్ష చెల్లింపు
- విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
- రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం మృతుల కుటుంబ సభ్యులు మృతదేహంతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నాగార్జునసాగర్ రహదారిపై ఆందోళనకు దిగారు. దాంతో ఏడు గంటలు వాహనాలతో రహదారులు స్తంభించాయి. మృతుల కుటుంబ సభ్యులు ఆగ్రహంతో డీఎంహెచ్ఓ స్వరాజ్యలకిëపై దాడి చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఏరియా ఆస్పత్రిలో మంచాల, ఇబ్రహీంపట్నం, యాచారం, మాడ్గుల మండలాల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ఈ నెల 25న కుటుంబ నియంత్రణ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో 34 మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్నారు. రెండు రోజుల తర్వాత వారిలో నలుగురికి తీవ్ర వాంతులు, విరేచనాలు అయ్యాయి. వీరిలో మాడ్గుల మండలం నర్సాయపల్లికి చెందిన నర్సింగ్ మమత(22)ను నగరంలోని బృండి ఆస్పత్రికి, మంచాల మండలం లింగంపల్లికి చెందిన సుష్మ(32)ను ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ ఆస్పత్రికి, మాడ్గుల మండలం కొలుకులపల్లి తండాకు చెందిన మౌనిక, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ సీతారాంపేటకు చెందిన లావణ్యలను ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. వారిలో సుష్మ ఆదివారం మృతిచెందగా, మమత సోమవారం మృతిచెందింది.
మృతదేహాలతో ఆందోళన
ప్రభుత్వ వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగానే సుష్మ, మమత మృతి చెందారని ఆరోపిస్తూ వారి కుటుంబ సభ్యులు మృతదేహాలతో ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. వీరికి సీపీఐ(ఎం) నాయకులు సామెల్, వెంకటేష్, సీహెచ్ జంగయ్య, కాంగ్రెస్ నాయకులు మల్రెడ్డిరంగారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కొండ్రు ప్రవీణ్‌కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, కొప్పు భాష, పోరెడ్డి అర్జున్‌రెడ్డి, టీడీపీ నాయకులు జక్క రాంరెడ్డి, చక్రపాణి మద్దతు తెలిపారు. సుమారు ఏడు గంటల పాటు నాగార్జున సాగర్ రహదారి స్తంభించింది. ఉన్నతాధికారులు వచ్చి హామీ ఇచ్చే వరకూ కదిలేది లేదని భీష్మించారు. దశల వారీగా ఆందోళనలు నిర్వహిస్తుండటంతో ఆందోళనకారులు, పోలీసులకు తీవ్ర తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో డీఎంహెచ్ఎం ఆందోళన చేస్తున్న స్థలానికి వచ్చి వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని తప్పకుండా అందజేస్తామని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తుండగా, మమత బంధువులు ఒక్కసారిగా డీఎంహెచ్ఓ స్వరాజ్యలకిëపైకి దూసుకెళ్లారు. దాంతో ఆమె చేతి గాజులు పగిలిపోయాయి. ఆమెకు పోలీసులు రక్షణ కల్పించి అక్కడి నుంచి పంపించేశారు.
బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆర్డీఓ వెంకటాచారి ప్రకటించారు. డీఎంహెచ్ఓ స్వరాజ్యలకిë, డిప్యూటీ డీఎంహెచ్ఓ నాగలకిë, తహసీల్దార్ రామ్మోహన్‌తో కలిసి ఆందోళనకారుల వద్దకు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఒక్కొక్క కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా, పిల్లల చదువులకు భరోసా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేందుకు అంగీకరించారు. ముందుగా రూ.లక్ష చెక్కులను అందజేశారు. ప్రభుత్వం తరపున లిఖిత పూర్వకంగా రాసిచ్చారు. కాగా, ఆపరేషన్ల విషయంలో జరిగిన తప్పిదాలపై సమగ్ర విచారణకు స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆదేశించారు. ఇదే విషయమై వైద్య విధాన పరిషత్ డిప్యూటీ కమిషనర్ రవీందర్‌నాయక్ విచారణ చేపట్టారు. సమగ్ర విచారణ జరిపి పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు.