Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) యాదాద్రి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ -వలిగొండ
మూసీ జల కాలుష్యం నుంచి విముక్తి కోరుతూ.. లక్ష సంతకాల సేకరణ చేపట్టనున్నట్టు సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ చెప్పారు. ప్రత్యా మ్నాయ నీటి వనరుగా ఉన్న గోదావరి జలాలను మూసీ ఆయకట్టు ప్రాంతానికి అందించాలని డిమాండ్ చేశారు. వలిగొండ మండలం పులిగిల్లలో సోమవారం సంతకాల సేకరణను ప్రారంభించారు. మూసీ ప్రక్షాళన కోసం ఈనెల 21 నుంచి 28 వరకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 10 మండలాల్లో, 90 గ్రామాల్లో, నాలుగు మున్సిపాలిటీల్లో పోరుయాత్ర నిర్వహించినట్టు చెప్పారు. ఆయకట్టుకు ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలను అందించాలని కోరారు. అనేక గ్రామాల్లో ప్రజలు ఈ యాత్రకు బ్రహ్మరథం పట్టారని, మంచి స్పందన వచ్చిందని తెలిపారు. వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించి మూసీ జల కాలుష్యాన్ని నివారించేందుకు రూ.పదివేల కోట్లు కేటాయించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా లక్ష సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రితోపాటు రాష్ట్ర గవర్నర్కు పంపించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, పీఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, మండల కమిటీ సభ్యులు వాకిటి వెంకట్ రెడ్డి, శాఖ కార్యదర్శి బుగ్గ చంద్రమౌళి, సహాయ కార్యదర్శి మారబోయిన నరసింహ, మాజీ సర్పంచ్ బుగ్గ దేవమ్మ, సీనియర్ నాయకులు దొడ్డి బిక్షపతి, వరికుప్పల యాదయ్య, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు వేముల చంద్రయ్య, వేముల అమరేందర్, మామిడి గీత సురేష్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి వేముల నాగరాజు నాయకులు బుగ్గ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.