Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కొక్కరి నుంచి వివరాలు సేకరణ
- బాధ్యులపై త్వరలోనే చర్యలు: మీడియా సమావేశంలో డీహెచ్ శ్రీనివాస్‌రావు
- విచారణకు హాజరుకాని సూపరింటెండెంట్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
'జరగకూడని తప్పు జరిగింది. నలుగురి ప్రాణం పోయింది.. ఇది చాలా బాధాకరం. ఆ కుటుంబాలకు జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు.. మిగతా 30 మందిని వివిధ ఆస్పత్రుల్లో చేర్పించాం. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. వారిలో 11 మందిని డిశ్చార్జ్ చేశాం. మరో 18 మందిని రెండ్రోజుల్లో ఇంటికి పంపిస్తాం. మరోసారి ఇలా జరగకుండా సరిదిద్దుకుంటాం' అని రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్‌రావు తెలిపారు. ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు మృతిచెందిన విషయం విధితమే. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం డీహెచ్ నేతృత్వంలో ఐదుగురి సభ్యులతో విచారణ కమిటీని నియమించింది. కమిటీ శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని ఆస్పత్రికి సందర్శించింది. మహిళాలకు ఆపరేషన్ చేసిన గదిని, పరికరాలను పరిశీలించింది. వైద్యులు, సిబ్బందిని ప్రశ్నించింది. ఈ సందర్భంగా డీహెచ్ మీడియాతో మాట్లాడారు. నలుగురు మహిళలు మృతిచెందడం బాధాకరం అన్నారు. మరో 30మంది మహిళల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. గత నెల 25న ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేసిన డాక్టర్లే.. ఆ మరు నాడు 26న చేవెళ్లలో ఒకే రోజు 60 మందికి, తరువాత సూర్యా పేటలో వంద మందికి ఆపరేషన్ చేశార న్నారు. అక్కడెక్కడా ఈ పరిస్థితి రాలేదన్నారు. ఇబ్రహీం పట్నంలో చేయిం చుకున్న వారికే ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు. ఇబ్రహీం పట్నం ఆస్పత్రి ఘటనపై విచారణ చేపట్టామని, ఆస్పత్రిలో పరిస్థితులపై సిబ్బందితో మాట్లాడినట్టు వెల్లడించారు. ఘటన జరిగిన రోజు పనిచేసిన సిబ్బందిని విచారించామన్నారు. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని డీహెచ్ తెలిపారు. ఆపరేషన్‌కు ఉపయోగించిన పరికరాల శుభ్రత పాటించకపోవడం వల్లే ఇన్ఫెక్షన్ జరిగినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చా మన్నారు. ఇదిలా ఉండగా, శుక్రవారం విచారణ కమిటీ ముందు విచార ణకు సూపరిం టెండెంట్ హాజరు కాలేదని తెలిసింది.
పురుషులు ముందుకు రావాలి..
రాష్ట్రంలో పురుషులు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకునేందుకు ముందుకు రావాల్సిన అవసరముందని డీహెచ్ అన్నారు. అందుకు వారిలో అపోహను తొలగించాలన్నారు. దేశంలోకెల్లా తెలంగాణలో పురుషులు ఆపరేషన్లు చేసుకుంటున్న వారి సంఖ్య ముందు స్థానంలో ఉందని, ఇంకా పెరగాల్సిన అవవసరముందన్నారు. ఆయన వెంట డీఎంహెచ్ఓ స్వరాజ్యలకిë, డిప్యూటీ డీఎంహెచ్ఓ నాగజ్యోతి తదితరులున్నారు.
ఐద్వా ఆధ్వర్యరంలో నిరసన
విచారణ కమిటీ ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి వస్తుందన్న సమాచారం తెలుసుకున్న ఐద్వా ప్రతినిధులు కార్యదర్శి సుమలత, అధ్యక్షులు విజయ, ఉపాధ్యక్షులు మస్కు అరుణ, మండల అధ్యక్షులు మున్ని, కార్యదర్శి ఇందిర ఆధ్వర్యంలో ఆస్పత్రి వద్ద నిరసనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు బలైపోయాయన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.