Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సామూహిక వినాయక నిమజ్జనం నేపథ్యంలో హుస్సేన్ సాగర్ వద్ద సర్కారు విద్యుత్ సరఫరా కోసం ఏర్పాట్లు చేసింది. గురువారం అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు విద్యుత్ కంట్రోల్ రూంలను ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి ప్రారం భించారు.
డిమాండ్ ఉన్న నిమజ్జనం చేసే ప్రాంతాల్లో మరో 20 ట్రాన్స్ ఫార్మార్లను, ఎల్టీ కేబుల్‌ను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. హుస్సేన్ సాగర్, సర్దార్ మహల్, బషీర్‌బాగ్, గాంధీనగర్, సరూర్‌నగర్, తదితర ముఖ్యమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన అన్ని కంట్రోల్ రూంలను ఆపరేషన్స్ డైరెక్టర్ జె.శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షిస్తారని తెలిపారు. గణేష్ మండపాలను సందర్శించి నిమజ్జన మార్గాలను పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూపరింటెండింగ్ ఇంజినీర్లను ఆదేశించారు.
ప్రజలు, మండపాల నిర్వాహకులు భద్రతా చర్యలను పాటించాలని కోరారు. ఎస్పీడీసీఎల్ ఇప్పటికే 24 మంది చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లను ఆయా ప్రాంతాల ఇన్ఛార్జీలుగా నియమించిందని చెప్పారు. విద్యుత్‌కు సంబంధించి అత్యవసర పరిస్థితులు తలెత్తితే 100 లేదా 1912కు లేదా ట్యాంక్ బండ్ వద్ద ఎలక్ట్రిసిటీ కంట్రోల్ రూం 79015 30966కు, ఎన్టీఆర్ మార్గ్ వద్ద కంట్రోల్ రూం 70915 30866కు ఫోన్ చేయాలని సూచించారు.
నేడు మూడు జిల్లాలకు సెలవు
సామూహిక గణేష్ నిమజ్జనం నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలనాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు ఈ సెలవు వర్తించనున్నది. ఇందుకు బదులుగా నవంబర్ 12 (రెండో శనివారం)ను పనిదినంగా ప్రకటించింది.