Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లను కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. జూన్ 15 నుంచి జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లను కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్వర్వులు విడుదల చేయడం పట్ల గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ హర్షం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గత ఎనిమిది, తొమ్మిదేండ్లుగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమైన జూన్ 15 నుంచే తమను కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.