Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనసాగించాలని డీవైఎఫ్ఐ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఉన్న అంబేద్కర్ కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్లను ఉద్దేశపూర్వకంగా విధులనుంచి తొలగించడం అన్యాయమని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ విమర్శించింది. వారికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తొలగించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఆ కాలేజీ యాజమాన్యం స్పందించి లెక్చరర్లను కొనసాగించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అనేక ఏండ్లుగా ఇతర అవకాశాలన్నింటినీ వదులుకుని వారు ఆ కాలేజీలో లెక్చరర్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. హక్కుల గురించి అడిగిన నేరానికి వాళ్లను లక్ష్యంగా చేసుకుని అర్ధాంతరంగా విధుల నుంచి తొలగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ చర్య వల్ల వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలేజీ యాజమాన్యం వేధింపులను తట్టుకోలేక ఒక మహిళ లెక్చరర్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా వార్తస్తులొన్నాయని తెలిపారు. ఇలాంటి కక్షసాధింపు చర్యలను మానుకోవాలనీ, సంబంధిత లెక్చరర్లను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్దఎత్తున లెక్చరర్లకు అండగా నిలబడతామనీ, న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని హెచ్చరించారు