Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
విత్తన రంగంలో మరిన్ని పరిశోధనలు జరగాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ ప్రాంతం వాతావరణ రీత్యా విత్తన పరిశోధనలు, విత్తనోత్పత్తికి చాలా అనుకూలమన్నారు. విత్తన కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా సహకారమందిస్తుందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో 'బయోటెక్నాలజీ ద్వారా పంటల అభివద్ధి'పై అనే అంశంపై భారత జాతీయ విత్తన సంఘం సదస్సు నిర్వహించింది. జూమ్ మీటింగ్ ద్వారా ఆ సదస్సునుద్దేశించి మంత్రి మాట్లాడారు. ఇలాంటి సదస్సులు విత్తన కంపెనీలు, పరిశోధకులకు ఒక దిశను చూపిస్తాయని చెప్పారు. దేశానికి అవసరమైన 50 శాతం పత్తి విత్తనాలు మన రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. విత్తన కంపెనీలు, పరిశోధకులు దీన్ని ఉపయోగించుకునేందుకు ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. నాణ్యమైన విత్తనాలు అందించడంతోపాటు నాణ్యత లేని విత్తనాలు మార్కెట్లోకి రాకుండా చూడా ల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రస్తుతం పండ్లు, పూలు, పాల ఉత్పత్తులు, చేపల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ రంగాల్లో అభి వద్ధిని సాధించినప్పటికీ మరెంతో సాధించాల్సి ఉందన్నారు. ఆ కార్య క్రమంలో ఆ సంఘం అధ్యక్షులు, నూజీవీడు సీడ్స్ అధినేత ప్రభాకర్‌రావు, దేశంలోని ప్రముఖ విత్తన సంస్థల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.