Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓర్వలేక రేవంత్‌పై విమర్శలు చేస్తారా?
- బీజేపీ నేతలకు అయోధ్యరెడ్డి ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎప్పుడో రాజీనామా చేసిన కంపెనీతో (అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రయివేటు కంపెనీ) రేవంత్‌రెడ్డికి సంబంధాలెలా ఉంటాయని టీపీసీసీ అధికార ప్రతినిధి బొరెడ్డి అయోధ్యరెడ్డి బీజేపీ నేతలను ప్రశ్నించారు. బీజేపీపై రేవంత్ రాజీలేకుండా పోరాడుతున్నారనీ, అందుకే ఓర్వలేక ఆయనపై ఆ పార్టీ విమర్శలు చేస్తున్నారని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలతో కలిసి అయోధ్యరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. 2010 ఫిబ్రవరి 2న ఆ ఆర్వోసీలో రిజిస్ట్రర్ అయిందనీ, ఇందులో డైరెక్టర్‌గా ఉన్న రేవంత్...అదే నెల ఫిబ్రవరి15న రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత సదరు కంపెనీని 2013 మే 9న మూసేశారని తెలిపారు. అందువల్ల కంపెనీతో రేవంత్‌కు సంబంధమే లేదని చెప్పారు. అయినప్పటికీ బీజేపీ నేతలు ప్రగతిభవన్‌కు, గాంధీభవన్‌కు లింకుందంటూ మాట్లాడటం సరైందికాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై రేవంత్ పోరాటం ఆగదని చెప్పారు. రాజకీయంగా ఆయన్ను ఎదుర్కొలేకనే బీజేపీ నేతలు విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. చిల్లర ప్రచారాలకు, కుప్పిగంతులను ఆయన లెక్క చేయరనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. లిక్కర్ స్కాంలో కవితతోపాటు రేవంత్‌రెడ్డికు సంబంధం ఉందంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీజేపీ నేతల వద్ద ఆధారాలుంటే దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు.