Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్లో గణేశ్ శోభాయాత్రలో పాల్గొనడానికి వచ్చిన అసోం సీఎం హిమంత బిశ్వశర్మను మాట్లాడనీయకుండా టీఆర్ఎస్ నేతలు మైక్ లాక్కోవడం హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం భద్రత కల్పించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆరోపించారు. మెడలో టీఆర్ఎస్ కండువా వేసుకున్న టీఆర్ఎస్ నాయకులను ప్రోటోకాల్ లేకుండా పోలీసులు స్టేజీపైకి ఎట్టా రానిచ్చారు?అని ప్రశ్నించారు. దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ నేతపై తక్షణమే అరెస్ట్ చేసి హత్యా యత్నం కేసు పెట్టాలన్నారు.