Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగారు భారత్ ఆయనతోనే సాధ్యం..
- విలేకర్ల సమావేశంలో టీఆర్ఎస్ జిల్లాల అధ్యక్షులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, పట్టుదల వల్ల బంగారు తెలంగాణ స్వప్నం సాకారమైందని పలు జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ అధ్యక్షులు చెప్పారు. ఈ క్రమంలో బంగారు భారత్ అనేది ఆయనతోనే సాధ్యమని వారు వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మంచిర్యాల, పెద్దపల్లి, హైదరాబాద్ జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్, కోరుకంటి చందర్, మాగంటి గోపీనాథ్‌తోపాటు మొత్తం 21 జిల్లాల అధ్యక్షులు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మోడీ ఎనిమిదేండ్ల నుంచి దేశంలో రాక్షస పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. తద్వారా భారత్‌ను ఓ వందేండ్లు ఆయన వెనక్కు తీసుకెళ్లారని తెలిపారు. బీజేపీ వల్ల ఏ ఒక్క వర్గానికీ న్యాయం జరగటం లేదన్నారు. ఈ తరుణంలో దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. అందువల్ల కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి.. జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఆయన కోసం దేశం ఎదురు చూస్తున్నదని తెలిపారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం సీఎం తన శక్తి సామర్థ్యాలను వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రకు స్పందనే లేదని విమర్శించారు. అది ఓ పాత చింతకాయ పచ్చడంటూ ఎద్దేవా చేశారు.