Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సదస్సు-వ్యాస రచన పోటీలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వీరనారి ఐలమ్మ వర్థంతి సందర్భంగా శనివారం హైదరాబాద్లోని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా), ఐలమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో సదస్సు-వ్యాస రచన పోటీలు నిర్వహించనున్నట్టు ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో వీటిని నిర్వహిస్తామని పేర్కొన్నారు.
నైజాం నవాబు ప్రజలపై సాగిస్తున్న అకృత్యాలకు వ్యతిరేకంగా, భూమి కోసం భుక్తికోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అత్యంత ధైర్యసాహాసాలతో ఆ పోరాటంలో పాల్గొన్న ధీర వనిత
ఐలమ్మని తెలిపారు. అలాంటి పోరాట యోధుల పోరాట చరిత్రకు కొన్ని శక్తులు వక్రభాష్యాలు చెబుతున్న నేటి తరుణంలో ఆ చరిత్రను గుర్తుచేస్తూ '' స్వతంత్య్ర పోరాటంలో మహిళల పాత్ర'' అనే అంశంపై సదస్సు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త పీఏ దేవి, ప్రొఫెసర్ పద్మజాషా, ఐద్వా సీనియర్ నాయకులు టి జ్యోతి, హైమావతి, రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి ప్రసంగిస్తారని తెలిపారు. వ్యాస రచన పోటీల్లో పాల్గొన దలిచన వారు స్వాతంత్య్ర ఉద్యమంలో మహిళల పాత్ర పై రెండు పేజీలు మించకుండా ఇంటి వద్దనే వ్యాసం రాసు కుని తీసుకు రావాలని విజ్ఞప్తి చేశారు.