Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి
- ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హర్యానాలో జీపుకు సైడ్ ఇవ్వలేదనే కోపంతో ఓ విద్యార్థి ఆర్టీసీ బస్సు డ్రైవర్ జగ్బీర్సింగ్ను హత్య చేయడాన్ని ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) తీవ్రంగా ఖండించింది. మరణించిన డ్రైవర్ కుటుంబానికి సంతాపం తెలిపింది. ఈ మేరకు శుక్రవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ 6వ తేదీ సోనేపట్ డిపోకు చెందిన హర్యానా రోడ్‌వేస్ హైర్ స్కీమ్ బస్సు జైపూర్‌కు బయలుదేరినప్పుడు ఈ ఘటన జరిగినట్టు ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య తెలిపారు. వెనుక నుంచి జీపులో హారన్ కొడుతున్న విద్యార్థిని వారించేందుకు ప్రయత్నించిన బస్సు డ్రైవర్, కండక్టర్‌పై నుంచి జీపును పోనివ్వడంతో డ్రైవర్ మర ణించి, కండక్టర్ గాయపడ్డారని తెలిపారు. డ్రైవర్ అంత్యక్రియలు ముగి యగానే అదేరోజు అతని కుమారుడు కూడా మరణించడం కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై హర్యానా రోడ్‌వేస్‌కు చెందిన అన్ని యూనియన్లు ఐక్యంగా ''సంఝా మోర్చా'' జేఏసీగా ఏర్పడి ఆందోళనకు దిగాయని తెలిపారు. జీప్ డ్రైవర్‌ను అరెస్టు చేసి, మృతుని కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమా ండ్ చేశాయి. దీనిపై పలు దఫాలు చర్చలు జరిగిన అనంతరం హర్యానా రవాణా శాఖ మంత్రి నేరస్థుడిని అరెస్టు చేస్తామనీ, మరణించిన డ్రైవర్ కుటుంబానికి 10 లక్షల పరిహారం, వారి కుమారుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, గాయపడిన బస్ కండక్టర్‌కు లక్ష రూపాయల పరిహారం అందిస్తామని లిఖితపూర్వకంగా అంగీకరిం చారు. అలాగే నష్ట పరిహారాన్ని రూ. 50 లక్షలకు పెంచేందుకు సంబంధించిన ఫైల్‌ను ముఖ్యమంత్రికి పంపుతామనీ చెప్పారు. దీనితో కార్మిక సంఘాలు ఆందోళనలను విరమించాయి. నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు.