Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
నిత్యం పలుకుబడుల భాషకై పరితపించిన వ్యక్తి కాళోజీ అని తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఆనందాచారి పేర్కొన్నారు. తెలంగాణ యాస, భాష, భావుకతకు కాళోజీ సాహిత్యం ప్రతీకగా నిలుస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ సాహితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద జరిగిన కాళోజీ జయంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, కవిగా కాళోజీ చేసిన సేవలు గొప్పవని, వాటి ప్రాసంగికత నేటికీ ఉందని గుర్తుచేశారు. నేటి యువత కాళోజీ రచనలు నుంచి స్ఫూర్తి పొంది మతోన్మాదానికి వ్యతిరేకించాలని ఆకాంక్షించారు. టీపీఎస్కే నాయకులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... కాళోజీ నా గొడవ మనందరిదని, నా గొడవ ను అందరం మరోసారి చదవాల్సిన అవసరం ఉందని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు తంగిరాల చక్రవర్తి మాట్లాడుతూ తెలంగాణ మాండలిక భాషాభివృద్ధికి కాళోజీ విశేష కృషి చేశారని అన్నారు. ఈ సభలో తెలంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అనంతోజు మోహన్ కృష్ణ, సహయ కార్యదర్శి సలీమ, హైదరాబాద్ నగర కమిటీ సభ్యులు జి. నరేష్, ఎం. రేఖ, రామకృష్ణ చంద్రమౌళి, రఘు, సుభాషిణి, డీవైఎఫ్ఐ నాయకులు విజరు, మహేందర్ తదితరాలు పాల్గొన్నారు. అంతకు ముందు కాళోజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.