Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేతనాలు పెంచేదాకా.. సమస్యలు పరిష్కరించేదాకా పోరు
- 13న చలో అసెంబ్లీ
- భూపాలపల్లిలో అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం
- సింగరేణి కాంట్రాక్టు కార్మికుల నిరవధి సమ్మెలో జేఏసీ నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వేతనాలు పెంచేదాకా, సమస్యలు పరిష్కరించేదాకా సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె కొనసాగుతుందని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. 13న చలో అసెంబ్లీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. భూపాలపల్లిలో కాంట్రాక్టు కార్మికులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. చర్చలు జరుగుతున్నాయంటూ, సమ్మెలో ఎవరు పాల్గొనవద్దంటూ హెచ్చరించడం ద్వారా సింగరేణి యాజమాన్యం సమ్మె విచ్ఛిన్నానికి ప్రయత్నించిందని విమర్శించారు. అయినప్పటికీ సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో కాంట్రాక్ట్ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు. శుక్రవారం భదాద్రి జిల్లా కొత్తగూడెంలో సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట సమ్మెలో భాగంగా సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు బి.మధు, జి.సత్యనారాయణ, ఎ.కృష్ణయ్య, ఎ.వెంకన్న, కడారి సునీల్, యాకూబ్‌షావలీ, రాసుద్దీన్, ఓదేలు, శ్రీనివాస్, కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లిలో రాస్తారోకో నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అక్కడ జేఏసీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మందమర్రిలో కూడా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. శ్రీరాంపూర్‌లో సింగరేణి కాలనీల్లో ర్యాలీ నిర్వహించారు. గోలేటిలో ర్యాలీ నిర్వహించి, జీఎం కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మణుగూరులో సింగరేణి కాలనీలలో నాలుగు కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించి, సభ నిర్వహించారు. కోయగూడెంలో పిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రామగుండం-3 ఏరియాలో సెంటినరీ కాలనీలో సభ నిర్వహించారు. రామగుండం-2 ఏరియాలో 8ఇన్ క్లైన్ కాలనీలో మానవ హారం నిర్వహించారు. రామగుండం-1 ఏరియాలో గోదావరిఖని చౌరస్తాలో నిరసన ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్న కాంట్రాక్ట్ కార్మికులకు జేఏసీ నేతలు అభినందనలు తెలిపారు. అన్వేషణ విభాగం మొదలుకొని సివిల్, సివిక్, అండర్ గ్రౌండ్లు, ఓపెన్ కాస్ట్‌లు, సిహెచ్పిలు, స్టోర్లు వర్క్‌షాప్‌లు, కార్యాలయాలు, ఎస్ఎంఎస్ ప్లాంట్లు, బ్లాస్టింగ్ కార్మికులు, కన్వెయన్స్, డ్రైవర్లు తదితర అన్ని విభాగాల కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు.