Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల బందోబస్తు నడుమ మృతదేహం అప్పగింత
నవతెలంగాణ -మిర్యాలగూడ
మరో వీఆర్ఏల నేలకొరిగాడు.. అసలే అనారోగ్య సమస్యలు.. ఆపై ఆర్థిక ఇబ్బందులు.. రెండు నెలలుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో.. ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో వీఆర్ఏ ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన వెంటనే పెద్దఎత్తున తరలివచ్చిన తోటి వీఆర్ఏలు ఎమ్మెల్యే భాస్కరరావును ఘెరావ్ చేశారు. ఈ ఘటన శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. మిర్యాలగూడ మండలంలోని ఉట్లపల్లి గ్రామంలో కంచర్ల వెంకటేశ్వర్లు(38)కు తండ్రి తదనంతరం వీఆర్ఏ ఉద్యోగం వచ్చింది. తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవనం సాగించేవాడు. ఇటీవల కాలంలో వెంకటేశ్వర్లకు కిడ్నీ సమస్య వచ్చింది. దీనికి తోడు నాలుగు నెలలుగా కడుపునొప్పి తీవ్రంగా రావడంతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే వీఆర్ఏలు 47 రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో రెండు నెలలుగా జీతం రాక ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. పైగా అనారోగ్య సమస్యలు తీవ్రం కావడం.. చికిత్స చేయించుకోవడానికి డబ్బుల్లేకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. శనివారం ఇంట్లో ఎవరూ లేరని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కిరాణా షాప్ నుంచి భార్య, కూతురు వచ్చేసరికే వెంకటేశ్వర్లు ఫ్యాను వెళాడటాన్ని చూసి ఇరుగుపొరుగు సాయంతో కిందకు దించారు. వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ప్రభుత్వాస్పత్రికి తరలి3ంఆరు. అప్పటికే మతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఎమ్మెల్యే భాస్కరరావు ఘెరావ్
వీఆర్ఏ వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలుసుకున్న వీఆర్ఏలు జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున ఉట్లపల్లి గ్రామానికి తరలివచ్చారు. మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే భాస్కరరావును వీఆర్ఏలు అడ్డగించి ఘెరావ్ చేశారు. ప్రభుత్వం వీఆర్ఏల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్లే రోజుకొకరు ప్రాణం వదులుతున్నారని, కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం అంత్యక్రియల నిమిత్తం ఎమ్మెల్యే భాస్కరరావు పదివేల రూపాయలు అందజేశారు. ఏరియా ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం భారీ పోలీసు బందోబస్తు మధ్య గ్రామానికి తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి : సీఐటీయూ
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న వీఆర్ఏ వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా నాయకులు డబ్బికార్ మల్లేశ్, డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మూడవత్ రవి నాయక్ డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. వీఆర్ఏలు రెండు నెలలుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తక్షణమే వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.